ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడుద‌ల చేసిన అధికార‌క ప్ర‌క‌ట‌న ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌టా సంచ‌ల‌నంగా మారింది. ఎందుకంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్‌కు త‌ను ఇప్పుడు ఎటువంటి నిర్ణ‌యాన్ని తీసుకుంటాడో అనేది చ‌ర్ఛ‌నీయాంశంగా మారింది. మార్చి రెండో వారంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ట్టే ప్రెస్‌మీట్ ప్ర‌ధానంగా మూడు విష‌యాల‌పై స్పంధించ‌నున్న‌ట్టుగా మెగా కాంపౌండ్‌ను అందుతున్న స‌మాచారం. దీనికి సంబంధించిన న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ప్ర‌త్యేకంగా మీకు అందిస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెట్టబోతున్న ప్రెస్‌మీట్‌లో మూడు టాపిక్స్ హాట్ టాపిక్స్ మార‌నున్నాయి. ఒక‌టి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చిరంజీవిల మ‌ధ్య ఎటువంటి విభేధాలు లేవు అని క్లారిటిగా చెబుతున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ విధంగా చెప్ప‌టానికి వెనుక చిరంజీవి ప్ర‌మేయం ఉన్న‌ట్టుగా ఇండ‌స్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. అలాగే రెండోది ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిగ‌త విష‌యాల వివ‌ర‌ణ. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీసెంట్‌గా మూడో మ్యారేజ్ చేసుకొని టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీ అయ్యాడు. అయితే ఈ పెళ్ళి అనేది త‌న వ్య‌క్తిగ‌తం అంటూనే అందుకు వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌చ్చ‌ని అంటున్నారు. మూడ‌వ‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ అరంగేట్రం. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో రాజ‌కీయాలు ఏమాత్రం బాగోలేవు అని పొలిటిక్స్‌పై కౌంట‌ర్ వేస్తూనే, నేను పొలిటిక‌ల్ కెరీర్ వైపు ఆలోచించ‌డం లేదు, అవస‌రం రాదనుకుంటున్నాను అంటూ, స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు అనే ఊహాగానాలకు అవ‌కాశం క‌ల్పించే విధంగా మాట్లాడ‌వ‌చ్చు అంటూ టాలీవుడ్ వ‌చ్చే లీక్స్ ద్వారా తెలుస్తుంది. మొత్తానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెట్ట‌బోతున్న ప్రెస్‌మీట్ స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ అయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు ప్రెస్‌మీట్ పెడుతున్నాడు? వంటి విష‌యాల‌పై మీ కామెంట్స్‌ను తెలియ‌ప‌ర‌చండి.

మరింత సమాచారం తెలుసుకోండి: