టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యాక్ట‌ర్ అనుష్క‌. అనుష్క టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఇంత బిజిగా మారిపోవ‌టానికి కార‌ణం ముఖ్యంగా త‌ను న‌టించిన అరుంధ‌తి మూవీ స‌క్సెస్ కార‌ణంగానే అని టాలీవుడ్ అంటుంది. అరుంధ‌తి మూవీలో అనుష్క చేసిన పాత్ర‌, ఆ మూవీకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను అందుకున్న త‌రువాత అనుష్క‌కు వ‌రుస పెట్టి ఆఫ‌ర్స్ క్యూ క‌ట్టాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు అరుంధ‌తి నిర్మాత శ్యాం ప్ర‌సాద్ రెడ్డి, అరుంధ‌తి2 కోసం ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను స్టార్ట్ చేశాడు. అయితే ఇందులో లీడ్‌రోల్‌కు అనుష్క న‌టించ‌డంలేదు. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని ఎపిహెరాల్డ్‌.కామ్ ప్ర‌త్యేకంగా మీకు అందిస్తుంది. అనుష్క‌ను సీక్వెల్ నుండి త‌ప్పించిన ప్రొడ్యూజ‌ర్‌, ఈ పాత్ర‌లో మ‌రో న‌టికి ఛాన్స్ ఇచ్చారు. అరుంధ‌తి 2లో నిత్యామీన‌న్, అనుష్క పాత్ర‌లో న‌టిస్తుంది. దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు, అగ్రిమెంట్స్ కూడ అయిపోన‌ట్టు టాలీవుడ్ స‌మాచారం. అరుంధ‌తి మూవీను 13 కోట్ల రూపాల‌య‌తో నిర్మిస్తే, ఆ మూవీ 40 కోట్ల రూపాల‌య‌ల‌కు వ‌ర‌కూ వసూల్ చేసింది. ప్ర‌స్తుత ప‌రిస్థిల్లో అనుష్క త‌న మూవీలతో బిజిగా ఉండ‌టంతో అరుంధ‌తి2 మూవీకు త‌న డేట్స్‌ను అడ్జెస్ట్ చేయ‌డం క‌ష్టంగా మారింద‌ట‌. అందుకే నిర్మాత‌లు నిత్యామీన‌న్‌ను ఎందుకున్నారు. అరుంధ‌తి2 మూవీలో అనుష్క పాత్ర‌కు నిత్యామీన‌న్ స‌రిపోతుందా? ఈ టాపిక్‌పై మీ కామెంట్స్‌ను ఇక్క‌డ షేర్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: