దక్షిణాది సినిమా రంగాన్ని తన హాట్ లుక్స్ ఒక ఊపు ఉపి ఇప్పుడు తన స్వీయ చరిత్ర తో సంచలనంగా మారిన మలయాళీ సెక్సీ బ్యూటీ షకీలా హీరోయిన్ అంజలికి వార్నింగ్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అంజలి పేరు వింటేనే షకీలా మండిపోతోందట. దీనికి కారణం కొద్దిరోజుల కిందట షకీలా తన ఆత్మకథను పుస్తక రూపంలో తీసుకొచ్చిన విషయం తెల్సిందే ఈ పుస్తకం ఆధారంగా అంజలితో ఓ తమిళ నిర్మాత సినిమా చేస్తున్నాడంటూ జోరుగా ప్రచారం సాగింది. వీటిపై అంజలి క్లారిటీ ఇవ్వకపోవడంతో నిజమేనని అందరూ అనుకున్నారు. అయితే తరువాత అంజలి అటువంటి పాత్రలు చేసే చీప్ టైప్ వ్యక్తిని తనుకాదని అంజలి చెప్పుకొచ్చింది. ఏ నిర్మాత తనను సంప్రదించలేదని కూడా తెలిపింది.  ఏదోవిధంగా ఈ విషయం షకీలా చెవిలో పడిందట. ఇంకేముంది ఆమె షకీలా పై తన విశ్వరూపాన్ని చూపెట్టింది. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలని, ఐనా ఆమెను తనేమీ అనలేదని సన్నిహితులతో అన్నట్లు ప్రచారం సాగుతోంది. పొదుపుగా మాట్లాడితే బాగుంటుందని కూడ షకీలా అంజలికి వార్నింగ్ పంపినట్లు సమాచారం. లేదంటే చెన్నైలో అంజలి గడిపిన గత జీవితాన్ని రచ్చ చేస్తానని ఘాటుగా వార్నింగ్ ఇచ్చిందట షకీలా. 

మరింత సమాచారం తెలుసుకోండి: