యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అనాలోచితంగా చేసిన వ్యవహారంతో నిర్మాత బెల్లంకొండ సురేష్ కు కేవలం ఒకే ఒక్క వారంలో 40 లక్షలు పోగుట్టుకున్న విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం జూనియర్ బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘రభస’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ అనారోగ్యంలో ఉన్నా కనీసం జూనియర్ సమంతల పై ఒక డ్యూయెట్ సాంగ్ ను పూర్తి చేద్దామని బెల్లంకొండ సురేష్ చేసిన ప్రయత్నం జూనియర్ కు అసలు నచ్చకపోవడంతో నిర్మాత బెల్లంకొండకు ఇంత భారీ నష్టం వచ్చింది అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు జూనియర్ సమంతల తో ఈ సినిమాకు సంబంధించి ఒక యుగళ గీతం దాదాపు ఐదు రోజులు చిత్రీకరించిన తరువాత ఆ పాట సందర్భం కాని ఆ పాటకు వేసిన సెట్ కాని తనకు నచ్చలేదని ఈ ఐదు రోజుల షూటింగ్ ను క్యాన్సిల్ చేయడమే కాకుండా మళ్ళీ కొత్త సెట్ డిజైన్ చేసిన తరువాత ఈ పాటను మళ్ళీ తీద్దామని జూనియర్ షూటింగ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడట. ఈ పాటకు మళ్ళీ రీ షూట్ అంటే నిర్మాత బెల్లంకొండకు మరో 40 లక్షల ఖర్చుతో పాటు, చాల బిజీగా ఉన్న సమంత డేట్స్ మళ్ళీ ఎలా తెచ్చేది అని గోల పెడుతున్నాడట బెల్లంకొండ.  గతంలో కూడ ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా విషయంలో ఇలా కొన్ని సన్నివేశాలు తనకు నచ్చలేదు అని జూనియర్ పేచీ పెట్టడంతో అప్పట్లో దిల్ రాజ్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది అని అంటారు. జూనియర్ నిర్మాతలతో మరీ అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు అంటు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: