నంద‌మూరి చిన్నోడు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ర‌భ‌స మూవీ షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు. యంగ్‌టైగ‌ర్ మూవీలో కో స్టార్స్ న‌టించేందుకు ఇండ‌స్ట్రీలోని యంగ్ స్ట‌ర్స్ అయితే ఇట్టే ఒప్పుకుంటారు. ఆ విధంగానే గ‌తంలో ఎన్టీఆర్ న‌టించిన బాద్‌షా మూవీలో న‌వ‌దీప్ చిన్న పాటి పాత్ర‌ను చేశాడు. బాద్‌షాలో న‌వ‌దీప్ చేసిన పాత్ర చిన్న‌దైన‌, దానికి మంచి పేరు వ‌స్తుంద‌ని న‌వ‌దీప్ ఆశించాడు. అయితే ఆ మూవీ రిలీజ్ త‌రువాత, అనుకున్నంత స‌క్సెస్‌ను అందుకోలేక పోయింది. ఈ టాపిక్‌ను రీసెంట్‌గా న‌వ‌దీప్ మీడియాతో మాట్లాడుతూ 'నేను ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు వ‌చ్చి ప‌ది సంవ‌త్స‌రాలు అవుతుంది. చాలానే మూవీలు చేశాను. కాని అందులో కొన్నే క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించాయి. అయితే ఆ త‌రువాత వ‌చ్చిన అవ‌కాశాలు ఏవీ నాకు స‌క్సెస్‌ను అందించ‌లేదు. అందుకు కార‌ణం నేను చేసుకున్న త‌ప్పులే అని అర్ధం అయింది. చందమామ సినిమాతో విజయం అందుకున్న తర్వాత కొన్ని ప్రత్యేక పాత్రలే చేయాలనే ఉద్దేశంతో ఒక ఏడాది ఖాళీగా ఉన్నాను. అలాగే పాత్రలను ఎంచుకోవడంలో నేను చేసిన పొరబాటు వల్లే ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను' అంటూ మీడియాకు వ్య‌క్త‌ప‌రిచాడు. 'ఇటీవల చేసిన బాద్ షా. ఆ సినిమాలో నా పాత్రకి పెద్ద ప్రాధాన్యత లేదు ఆ పాత్ర నేనే కాదు ఎవరన్నా చేయవచ్చు. అందుకే ఇకముందు అలాంటి సినిమాలు చేయను' అంటూ మొహ‌మాటం లేకుండా చెప్పేశాడు. ఎన్టీఆర్ మూవీలో న‌టించ‌డం వ‌ల్ల త‌నకు ఏ మాత్రం క‌లిసిరాలేద‌ని చెప్పుకొచ్చాడు. ఇదంతా ప్ర‌స్తుతం న‌వ‌దీప్ న‌టించిన‌ బంగారు కోడి పెట్ట మూవీ విడుద‌ల సంద‌ర్భంగా న‌వ‌దీప్ ఈ విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నాడు. న‌వ‌దీప్ అనుకున్న‌ట్టు ప్ర‌త్యేక పాత్ర‌ల‌తోనే త‌న కెరీర్ వెన‌క్కి వెళ్లిందా? మ‌రో కార‌ణాల‌తో వెన‌క్కి వెళ్ళిందా? ఈ టాపిక్‌పై మీ కామెంట్స్‌ను ఇక్క‌డ తెలియ‌జేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: