ఎన్నికల ప్రకటన వెలువడిన కొద్ది గంటలకు పవన్ పెట్టబోతున్న మీడియా సమావేశం వాయిదా పడింది అని వెబ్ మీడియాలో వార్తలు వస్తున్నా ఆ వార్త అధికారికం కాదు అంటున్నారు పవన్ సన్నిహితులు. ఈ మాటలకు బలం చేకూరుస్తు పవన్ తో ‘పంజా’ సినిమాను తీసిన నిర్మాత పవన్ సన్నిహితురాలు పవన్ అభిమానుల కోసం తన ట్విటర్ లో ఒక సందేశం పెట్టారు. . ''ఎవరికి తోచిన విధంగా వాళ్లు ఎందుకు ఏవేవో చెప్పుకుంటున్నారు త్వరలోనే అతనే అన్ని విషయాలు వెల్లడించనున్నాడు. అప్పటి వరకు కాస్త ఒపిక పట్టండి'' అంటూ ఆమె ట్వీట్ చేశారు. దీనికి కొనసాగింపుగా పవన్ ప్రస్తుత పరిస్థుతులలో పొలిటికల్ పార్టీ పెట్టకపోయినా కోస్తా ప్రాంతంలోని కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలు చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. ఈ వార్తలు ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనకు అత్యంత విశ్వసనీయులైన పార్టీ నేతలు సి.ఎం.రమేష్, కంభంపాటి రామ్మోహన్‌రావులచేత 25 అసెంబ్లీ స్థానాలు కాకినాడ పార్లమెంట్ స్థానం పవన్ కు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు వీలుగా వదిలి వేస్తామని ఎన్నికల తరువాత మాత్రమే తెలుగుదేశం పార్టీకి మద్దతుపై ఆలోచించే విధంగా సరికొత్త ప్రపోజల్ పంపినట్లు టాక్. అయితే రకరకాల పార్టీ వ్యక్తులు, రకరకాల అభిప్రాయాలు వస్తున్న పవన్ తన మనసులోని మాట ఏమి చెప్పకుండా చాల మౌనంగా ఉంటున్నాడట. ఈ వార్తలు ఇలా ఉండగా తూర్పు గోదావరి జిల్లానుండి వచ్చిన పవన్ సామాజిక వర్గానికి చెందిన ఒకనాటి ప్రజారాజ్యం నాయకులు వంగాగీతా, తోట త్రిమూర్తులు ఇప్పుడు పవన్ రాజకీయాలలోకి రావడం ఏమంత మంచిది కాదు అనే అభిప్రాయాన్ని పవన్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దీనికితోడు చిరంజీవి ఆఖరి బ్రహ్మస్త్రంగా పవన్ ఎటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకోకుండా తన తల్లి అంజనాదేవిని పవన్ వద్దకు రాయబారం పంపినట్లుగా కూడ తెలుస్తోంది. ఇన్ని గందరగోళాల మధ్య పవన్ రాజకీయాలలోకి రాడు అని చాలామంది అనుకుంటున్నా ఖంగారులో పవన్ ఏమైనా నిర్ణయానికి వస్తాడా అనే ఆశక్తితో ప్రతీ రాజకీయ పార్టీ ఎదురు చూస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: