ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ ప్ర‌వేశం దాదాపు ఖాయ‌మవడంతో రేపు ఆదివారం జరగబోయే మీడియా సమావేశంలో పవన్ విడుదల చేయబోతున్న పుస్తకంలో ఏముంటుంది అనే విషయం పై వార్తలు వస్తున్నాయి. పార్టీని ఇంత తక్కువ సమయంలో జ‌నంలోకి తీసుకెళ్ల‌డానికి అంత‌గా స‌మ‌యం చాలదు కాబట్టి తన భావాలను ప్రజలతో పంచుకోవడానికి ఆయుధంగా ఈ పుస్తకాన్ని పవన్ రాసారు అని అంటున్నారు.. అందులో రాజ‌కీయ అంశాలతో పాటు తాను చూడ‌ద‌ల‌చుకొన్న భార‌త‌దేశాన్ని ఆ పుస్త‌కంలో ఆవిష్క‌రించాడ‌ట‌. సామ‌న్యుడి బ‌తుకు బాగు ప‌డాలంటే ఏం చేయాలి? రాజ‌కీయాల‌ను ఎలా ప్ర‌క్షాళ‌న చేయాలి? అనే విష‌యాల‌ను విపులంగా వివ‌రించాడ‌ట‌. ఈ స‌మాజంలో ఉన్న స‌మస్య‌లేంటి? వాటికి ప‌రిష్కార మార్గాలేంటి? ఇలాంటి విష‌యాల‌పై త‌న అభిప్రాయాల‌ను ఆ పుస్త‌కంలో రాశాడ‌ట‌.  ఈ పుస్తకాన్ని పవన్ దాదాపు 9 సంవత్సరాలు నుండి రచిస్తున్నాడట. ఈ పుస్తకం పై మరియు ప్రస్తుత రాజకీయ వ్యవస్థ పై దాదాపు 45 నిముషాలు ప్రసంగించడానికి పవన్ రిహార్సిల్స్ చేసుకుంటున్నాడట. పవన్ పెట్టబోయే మీడియా సమావేసానికి జాతీయ మీడియాను కూడ ఆహ్వానిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘ఐడియలిజమ్ ఇన్ పాలిటిక్స్’ అనే విషయం పై పవన్ ఎక్కువ మాట్లాడుతాడు అని అంటున్నారు. ఈ వార్తలు ఇలా వస్తూ ఉండగా పవన్ రాసిన పుస్తకం వెనుక పవన్ మాట్లాడబోయే మాటల వెనుక పవన్ ప్రియనేస్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ ముద్ర స్పష్టంగా ఉంటుందని చెపుతున్నారు. త్రివిక్రమ్ మాటలు ఆయుధాలుగా మార్చుకుని తన ఆవేశంతో మిళితం చేసి పవన్ రాసిన పుస్తకం జరగబోతున్న మీడియా సమావేశం రోజురోజుకు రాజకీయ వర్గాలలో ఆశక్తిని రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: