దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కొచ్చాడయాన్' చిత్రం విడుదల కాకముందే సంచలనాలు రికార్డు చేయడం మొదలు పెట్టింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని ప్రమోట్ చేయడానికి కూడా నిర్మాతలు 15 కోట్లు వెచ్చిస్తున్నారు అనే మాట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తమిళ, తెలుగు, హిందీతో పాటు పంజాబీ, భోజ్పురి, మరాఠి భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమాకు ఇండియన్ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసే విధంగా ప్రచారం ఊదర కోడతారట. ఒక్క చెన్నై సిటీలోనే నాలుగు వేల హోర్డింగులు ఏర్పాటు చేయబోతున్నారట. ‘కొచ్చాడయాన్' తెలుగులో ‘విక్రమసింహ' పేరుతో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం మార్చి 9వ తేదీన చెన్నైలోని ‘సత్యం సినిమాస్'లో గ్రాండ్‌గా జరుగనుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరై సీడీలను విడుదల చేయనున్నారు. అయితే ఈసినిమా ఏప్రిల్ 11 న రిలీజ్ చేయాలని ప్రకటించినా ఇప్పుడు ఆ డేట్ మేకి చేరినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో ఏప్రిల్ 24న ఎన్నికలు ఉండడంతో ఈసినిమా వెనక్కు తగ్గాల్సి వచ్చిందని సమాచారం. ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలను చూసాం. మొట్టమొదటిసారిగా భారీ పబ్లిసిటీ చేస్తున్న రజినీకాంత్ సినిమాను చూడబోతున్నాం. ఈ సినిమాను ఇండియా యావత్తూ 6 వేల ధియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి రజినీకాంత్ సినిమా ఎన్ని వందల కోట్లు కురిపిస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: