మెగా హీరో అల్లుఅర్జున్ న‌టిస్తున్న అప్‌కమింగ్ ఫిల్మ్ రేసుగుర్రం. రేసుగుర్రం మూవీ షూటింగ్ దాదాపు ముగిసింద‌నే చెప్పాలి. ఇదిలా ఉంటే రేసుగుర్రం మూవీ త్వ‌ర‌లోనే ఆడియో ఫంక్ష‌న్‌కు సిద్ధం అవుతుంది. దీంతో రేసుగుర్రం మూవీ ఆడియో రైట్స్ కూడ భారీ రేటుకే అమ్ముడుపోయాయ‌ని టాలీవుడ్ లెక్కులు చెబుతున్నాయి. ల‌హ‌రి మ్యూజిక‌క్ సంస్థ రేసుగుర్రం మూవీ ఆడియో హ‌క్కుల్ని రికార్డు రేటుకు కొన్న‌ది. దీనికి సంబంధించిన న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ప్ర‌త్యేకంగా మీకు అందిస్తుంది. ల‌హ‌రి సంస్థ రేసుగుర్రం ఆడియో రైట్స్‌ను 55 ల‌క్ష‌ల‌కు తీసుకుంది. గ‌తంలో ఇదే సంస్థ వ‌న్-నేనొక్క‌డినే మూవీ ఆడియో రైట్స్‌ను 72 ల‌క్ష‌ల‌కు కొన్న‌ది. వ‌న్ మూవీ త‌రువాత ఆ రేంజ్ హైప్ రేసుగుర్రం మ‌వీకు వ‌చ్చింది. అలాగే రీసెంట్‌గా నందమూరి బాల‌కృష్ణ న‌టించిన లెజెండ్ మూవీ ఆడియో రైట్స్‌ను కూడ ల‌హ‌రీ సంస్థే కైవసం చేసుకుంది. రేసుగుర్రం మూవీ ఆడియో లాంచ్ సంద‌ర్భంగా శృతిహాస‌న్ స్టేజ్ ఫెర్ఫార్మెన్స్‌ను ఇస్తుంద‌ని చిత్ర యూనిట్ నుండి అందిన స‌మాచారం. ఇదిలా ఉంటే అల్లుఅర్జున్ ప్ర‌స్తుతం, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రాబోతున్న మూవీ క‌థా చ‌ర్చ‌ల్లో బిజిగా ఉన్నాడు. సురేంద‌ర్ రెడ్డి చాలా గ్యాప్ త‌రువాత తీస్తున్న చిత్రం రేసుగుర్రం కావ‌డంతో, ఈ మూవీ క‌చ్ఛితంగా హిట్ సాధిస్తుంద‌ని చిత్ర యూనిట్ అంటుంది. రేసుగుర్రం మూవీ సురేంద‌ర్ రెడ్డికు స‌క్సెస్‌ను ఇస్తుందా? ల‌ఏలేదా? ఈ టాపిక్‌పై మీ కామెంట్స్‌ను పోస్ట్‌ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: