ఆది, శాన్వి మరోసారి జంటగా నటిస్తున్న సినిమా ప్యార్ మే పడిపోయానే.. లవ్లీ సినిమాతో ఆకట్టుకున్న ఈ జంట మరోసారి ఈ సినిమాతో అలరించడానికి రెడీ అయ్యారు. రవి కుమార్ చావలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ నెల రెండవ వారంలో ఆడియో రిలీజ్ చేసుకోబోతున్న ఈ సినిమా ఈ నెల 28 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సరికొత్త ప్రేమకథతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందని చెబుతున్నారు చిత్ర యూనిట్. లవ్లీ సినిమాలో ఆది,శాన్వి జంటకి ఆడియెన్స్ దగ్గర మంచి మార్కులే పడ్డాయి. మరళ ఈ సినిమాతో కూడా మరోసారి అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 11 నుండి ఫారిన్ లొకేషన్ లో షూట్ చేసుకోబోతుంది ఈ సినిమా. ఆది కూడా సుకుమారుడు తర్వాత కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఈ సినిమా చేస్తున్నాడు. శాన్వి కూడా లవ్లీ తర్వాత చేసిన అడ్డా కూడా అంతలా ప్రేక్షకాదరణ పొందలేదు. ఈ సీనిమా ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటీ లో ఓ సాంగ్ షూట్ ని జరుపుకుంటుంది. సో అన్ని హంగులు ముగించుకుని ఈ సినిమా మార్చ్ 28 న ప్రేక్షకులముందుకు రానుంది. సో ఆది,శాన్వి ల జంట ఈసారి కూడా లవ్లీ లా అలరిస్తారో లేదో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఆది,శాన్విలు ఆడియెన్స్ ని ప్యార్ లో పడేస్తారా..? 

మరింత సమాచారం తెలుసుకోండి: