తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ కు కోపం వస్తే ఎంత పెద్ద నాయకులనైనా టార్గెట్ చేస్తారు. ‘అన్న పనైపోయింది.. తమ్ముడి దుకాణం షురూ అవుతోంది.. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా వుండాలి..’ అనే మాటలతో పవన్‌ పెట్టబోయే పార్టీపై టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానులకు తీవ్రకోపాన్ని తెప్పిoచినట్లుగా వార్తలు వస్తున్నాయి  ‘ఎవడెవడో వస్తున్నాడు సంక్రాంతికి గంగిరెద్దులు వస్తాయి కదా మస్తుగొస్తాయి..’ అంటూ పవన్‌ పార్టీఫై కేసీఆర్‌ సెటైర్లు వేసారు. అంతే కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది కనుక ఆంధ్రోళ్ళ పెత్తనం అవసరంలేదని మరో బాంబు విసిరారు కెసిఆర్. పవన్‌ పెట్టబోయే పార్టీ గురించి కేసీఆర్‌ కామెంట్స్‌ మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. పవన్‌ పార్టీ పెట్ట కుండానే ఇన్ని కామెంట్స్ వస్తూ ఉంటే వార్తల్లో వస్తున్నట్లుగా నిజంగానే పవన్ మల్కాజ్ గిరి నుండి పోటీ చేస్తే కెసిఆర్ ఇంకా ఎన్ని సెటైర్లు వదులుతాడో అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ పవన్ పై మరో బాంబు వదిలి సంచలనం చేసాడు. తనకు రాజకీయాలపై అవగాహన లేదని చెబుతూనే “ వ్యక్తిగతంగా బాబాయ్ దారి బాబాద్ దే నా దారి నాదే” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేసిన నాన్నకే నా సపోర్ట్ వుంటుంది అని స్పష్టం చేశాడు. బాబాయ్ కోసం కాదు గానీ నాన్న కోసమైతే ఏం చేయడానికైనా సిద్ధమే అని చరణ్ చెప్పాడు. రామ్ చరణ్ ప్రకటనతో మెగా కుటుంబంలో చీలికలు స్పష్టంగా మరోసారి బయటపడ్డాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: