టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ముఖ్యంగా రెండు వంశాల పేర్లు వినిపిస్తుంటారు. ఒక‌టి నంద‌మూరి వంశం. రెండు మెగా ఫ్యామిలి. ఈ రెండు ఫ్యామిలీల మ‌ధ్య వ్య‌క్తిగ‌తంగా మంచి సంబంధాలు ఉన్న‌ప్ప‌టికీ, వృత్తిప‌రంగా పోటీ ప‌డుతూనే ఉంటారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా మెగా ఫ్యామిలీలో పూర్తి వేరియేష‌న్ వ‌చ్చింద‌ని ప్ర‌స్పుటంగా తెలుస్తుంది. మెగా ఫ్యామిలి ఎప్ప‌టికీ విడిపోదు అని మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పై గొంతు అరిచి మ‌రీ చెప్పిన మాట‌లు ఇప్పుడు ఒట్టిమాట‌లుగానే మిగిలిపోయాయి. దీనికి సంబంధించిన న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ప్ర‌త్యేకంగా మీకు అందిస్తుంది. దీనికి కార‌ణం లేటెస్ట్‌గా రామ్‌చ‌ర‌ణ్ చేసిన కామెంట్స్ అందుకు స‌మాధానంగా నిలిచింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ ఎంట్రిపై రామ్‌చ‌ర‌ణ్ అలా స్పంధించ‌కుండా ఉండాల్సింది. ఒక వేళ బాబాయ్ పార్టిపెడితే ప్యామిలి స‌పోర్ట్ క‌చ్ఛితంగా ఉంటుంది. కాక‌పోతే నా స‌పోర్ట్ మాత్రం నాన్న గారికే అని రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడిన ఈ మాటల్లో ఏ మాత్రం త‌ప్పును వెత‌కాల్సిన అవ‌స‌రం లేదు. కాని బాబాయ్ పొలిటిక‌ల్ పార్టీ పెడ‌తాడో? లేదో? ఇంకా స్టేట్‌మెంట్ బ‌య‌ట‌కు రాకముందే, రామ్‌చ‌ర‌ణ్ త‌న స‌పోర్ట్‌ను చింజీవికే అని వేరు చేయ‌డం, ఇది ఇప్పుడు చెప్పాల్సిన స్టేట్‌మెంట్ కాద‌ని అంటున్నారు. రామ్‌చ‌ర‌ణ్ పొర‌పాటున ముందుగానే త‌న‌ అభిప్రాయాల‌ను చెప్పాడ‌ని కొంద‌రు అంటున్నారు. మెగా ఫ్యామిలిలో రెండు పార్టీలు ఉంటే, వ్య‌క్తిగ‌తంగా క‌లిసి ఉంటున్నా, వృత్తి ప‌రంగా నిత్యం వారి విధి విధాల‌తో పోటీ ప‌డుతూనే ఉంటారు. ఇది వ్య‌క్తిగ‌త జీవితంపైనా ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంది. రామ్‌చ‌ర‌ణ్ త‌న అభిప్రాయం త‌రువాత‌, ఇంకా ఇద్ద‌రు వ్య‌క్తులు వారి అభిప్రాయాల‌ను చెప్పాల్సి ఉంది. వారు నాగేంద్ర‌బాబు, అల్లుఅర్జున్‌. వీరిద్ద‌రూ చింజీవికే అండ‌గా ఉంటే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మెగా ఫ్యామిలిలో ఒక్క‌డిగానే మిగిలిపోతాడు. ఒక్కసారి జాయింట్ ఫ్యామిలికి బీట‌లు బారిందంటే అది అతుక్కోవ‌డం అనేది అతుకుల బొంత‌గానే క‌నిపిస్తుంది. బాబాయ్‌పై రామ్‌చ‌ర‌ణ్ ఇంత త్వ‌ర‌గా ఒపెనియ‌న్ చెప్ప‌డం స‌రైన‌దా? లేక ఇంకొంచెం టైం తీసుకొని చెప్ప‌డం స‌రైన‌దా? ఈ టాపిక్‌పై మీ కామెంట్స్‌ను తెలియ‌ప‌ర‌చండి.

మరింత సమాచారం తెలుసుకోండి: