హీరో నానితో ‘జండా పై కపిరాజు’ సినిమా తీసిన సముద్ర ఖని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు అంటూ కోలీవుడ్ మీడియాలో నిన్న వచ్చిన వార్తలకు ఆయన ప్రతిస్పందించాడు. ఈ వార్తలను విన్న కోలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమ షాక్ కు గురైంది. తన గురించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారంలోకి రావడంతో ఖంగుతిన్న సముద్రఖని మీడియా ముందుకు వచ్చి స్పందించారు. తాను ఎలాంటి ఆత్మహత్య యత్నానికి పాల్పడలేదని, తన గురించి వస్తున్న అలాంటి వార్తలు నమ్మ వద్దని చెప్పుకొచ్చారు. ఒక సినిమా స్క్రిప్టు డిస్కర్షన్లో భాగంగానే తాను సిటీ వదిలి బయటి ప్రాంతానికి వెళ్లానని, అంతకు మించి మరేమీ లేదని సముద్ర ఖని చెప్పాడు.. ఇంతకీ ఈ దర్శకుడి పై ఇలాంటి ఆత్మహత్య వార్తలు ప్రచారంలోకి రావడానికి కారణం ‘నిమిర్థ్ను నిల్' తమిళ సినిమా విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడమే అని అంటోంది కోలీవుడ్ మీడియా. ఈ చిత్రం ఆర్థిక సమస్యలతో విడుదల ఇబ్బందులు ఎదుర్కోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. సముద్రఖని తెలుగు సినిమాల విషయానికి వస్తే ఆయన గతంలో తెలుగులో ‘శంభో శివ శంభో', ‘సంఘర్షణ' చిత్రాలను తీసారు. ప్రస్తుతం హీరో నానీకి మిగిలి ఉన్న ఏకైక ఆశ ‘జెండాపై కపిరాజు' సినిమాను సముద్ర ఖని బాగా తీసాడు అనే టాక్ ఉంది. ఏమైనా హీరో నానీ సినిమా ప్రమాదం నుండి బయట పడినట్లే.  

మరింత సమాచారం తెలుసుకోండి: