కోలీవుడ్ సినిమా రంగానికే కాదు ఇండియన్ సినిమా సూపర్ స్టార్ గా రజనీకాంత్ ను పిలుస్తారు. అంతటి క్రేజ్, ఇమేజ్ వున్న హీరో కోలీవుడ్ లోనే కాదు దాదాపు అన్ని భాషల్లోను ఇంక ఎవ్వరులేరు. ఆయన నిర్వహించే సేవా కార్యక్రమాలను తమిళ తంబీలు కథలుకథలుగా చెప్పుకుంటుంటారు. మరి అంతటి సూపర్ హీరో తమిళనాడు రాష్ట్ర సీఎం గా ఎన్నికల బరిలోకి దిగితే ఎలాగుంటుంది? బంపర్ మెజారిటీతో నెగ్గుతాడు అనుకుంటారు చాలామంది. అయితే అటువంటి రజనీకాంత్ మాటలను కూడా లెక్క చేయకుండా తమిళ ఓటర్స్ 2004 లో షాక్ ఇచ్చారు. 2004 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఓటు చేయమని రజనీకాంత్ భాహిరంగంగా పిలుపునిస్తే అప్పుడు తమిళ ఓటర్లు కాంగ్రెస్ డిమ్ కే పార్టీ లకు బ్రహ్మరధం పట్టారు. దీనితో షాక్ కు గురైన రజని రాజకీయాల గురించి మాట్లాడటం మానేసారు. అయితే నిన్న చెన్నై లో అత్యంత ఘనంగా జరిగిన ‘కొచ్చాడియన్’ ఆడియో వేడుక తరువాత రజనీకాంత్ మీడియాతో సరదాగా మాట్లాడుతూ ఉంటె కోలీవుడ్ మీడియా ప్రతినిధులు రాబోతున్న ఎన్నికలలో రజని సపోర్ట్ మోడీకా? లేకుంటే కేజ్రీవాల్ కా?అంటూ ప్రశ్నించారట. అప్పటి దాకా సరదాగా మాట్లాడుతున్న రజని అనుకోని ఈ ప్రశ్నకు షాక్ గురై మళ్ళి కలుద్దాం అని వెళ్లిపోయారట. అయితే ఈ సంఘటన చూసిన చాలామంది కోలీవుడ్ పెద్దలు రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ మాటలను కూడా లెక్క చేయని ఓటర్లు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ భాహిరంగంగా బయటకు వచ్చి ఫలానా పార్టీకి ఓటు వెయ్యమoటే వేస్తారా అని సెటైర్లు వేసుకున్నారట.   

మరింత సమాచారం తెలుసుకోండి: