పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ వైపు మూవీలతోనూ, మరో వైపు పొలిటికల్ ఆలోచనలతోనూ బిజిబిజిగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి గబ్బర్ సింగ్2 అయితే, మరొకటి వెంకటేష్ తో కలిసి నటించే ఓ మై గాడ్ మూవీ రిమేక్. ఈ రెండు ప్రాజెక్ట్స్ ను పవన్ కంప్లీట్ చేస్తాడా? లేదా? అనే డైలమో ఇప్పుడు అందరిలోనూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 మూవీ ఎప్పటికీ స్టార్ట్ కాకపోవడంతో పవన్ డైరెక్టర్ కి ఆనందం కలుగుతుందట. టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ న్యూస్ ను ఎపిహెరాల్ట్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. గబ్బర్ సింగ్ డైరెక్టర్స్ మధ్య ఇప్పుడు వార్ జరుగుతంది. గబ్సర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, గబ్బర్ సింగ్2 డైరెక్టర్ సంపత్ నంది ల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని టాలీవుడ్ టాక్. ఎందుకంటే నిజానికి గబ్బర్ సింగ్2 మూవీను డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేయాలి. కాని చివరి నిముషంలో అది సంపత్ నందికు వెళ్ళింది. దీంతో సంపత్ నంది మిగతా హీరోలతో చేయాల్సిన ప్రాజెక్ట్స్ లోకి హరీష్ శంకర్ ఇన్వాల్స్ అవుతున్నాడని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్2 ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో ‘సంపత్ నంది గబ్బర్ సింగ్ స్టోరిపై కన్ ఫ్యూజ్ అవుతున్నాడు, నా దగ్గర ఫుల్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. కావాలంటే సహాయం చేస్తా’ అంటూ వేరే వాళ్ళ దగ్గర హరీష్, సంపత్ నందీను కామెంట్ చేస్తున్నట్టుగా టాక్స్ వినిపిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ డైరెక్టర్స్ మధ్య వార్ జరుగుతుంది అనేది టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. హరీష్ శంకర్, సంపత్ నంది ల మధ్య గొడవ నిజమేనా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయాండి.

మరింత సమాచారం తెలుసుకోండి: