దాదాపు మన తెలుగు డైరెక్టర్ అయిన క్రిష్ ను మనం మర్చిపోయి ఉంటాం. ఎందుకంటే తను రీసెంట్ గా ఎటువంటి తెలుగు ఫిల్మ్స్ ను తెరకెక్కించలేదు. అలాగే ఎటువంటి సినీ ప్రమోషన్స్ లోనూ జాయిన్ అవ్వలేదు. అయితే క్రిష్ ప్రస్తుతం తెలుగు మూవీ ఠాగూర్ ను హిందిలో రిమేక్ చేసే పనిలో ఉన్నాడు. ఈ రిమేక్ లో అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్నాడు. అయితే టాలీవుడ్ డైరెక్టర్ హిందీ మూవీకు డెబ్యూ పరిచయం కావడంతో, తనపై అక్షయ్ కుమార్ కామెంట్ చేశాడు. దీంతో ఇప్పుడు బిటౌన్ లో క్రిష్ పేరు హాట్ టాపిక్ గా మారుతుంది. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న గబ్బర్ మూవీను ‘క్రిష్ చాలా వేగంగానూ, ఠాగూర్ మూవీ కంటే బెటర్ అవుట్ పుట్ ను తీసుకువచ్చే విధంగా పనిచేస్తున్నాడని’ అక్షయ్ కుమార్ అన్నాడు. అంతేకాకుండా ‘ఈ మధ్య కాలంలో బిటౌన్ లో క్రిష్ వంటి డైరెక్టర్స్ ని నేను చూడలేదు. క్రిష్ చాలా బెటర్’ అంటూ బిటౌన్ డైరెక్టర్స్ పై కామెంట్ చేశాడు. బిటౌన్ డైరెక్టర్స్ ను ఉద్ధేశించి అక్షయ్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ డైరెక్టర్స్ కి కోపం తెప్పించాయట. సౌత్ డైరెక్టర్ తో మమ్మల్ని పోల్చి తక్కువ చేశాడని ఇప్పటికే ఓ డైరెక్టర్ అక్షయ్ కుమార్ పై డైరెక్ట్ గా కామెంట్ చేశాడు. ఇది ఇక్కడితేనే ఆగిపోతుందా? ఇంకా ముందుకు వెళుతుందా? అంటే కొద్ది రోజులు వేయిట్ చేయ్యాల్సింది. క్రిష్ తెరకెక్కిస్తున్న గబ్బర్ మూవీతో తనకి బిటౌన్ లో అవకాశాలు వస్తాయా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: