హీరో రానా తో ప్రేమ వ్యవహారం నడుపుతున్న త్రిష యూటర్న్ తీసుకుని ఒక కోలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమాయణం సాగిస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ అసిస్టెంట్ డెరైక్టర్ పక్కా స్త్రీ ద్వేషి అట. మొదట్నుంచీ ఎందుకనో అమ్మాయిలకు చాలా దూరంగా ఉంటాడట ఆవ్యక్తి. మరి అటువంటి వ్యక్తితో త్రిషకు ప్రేమాయణం ఏమిటీ అని అనిపిస్తోందా ! ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇది త్రిష నిజజీవితంలోని సంఘటన కాదు. త్రిష పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో ఈ మధ్యన కోలీవుడ్ లో విడుదలై సూపర్ హిట్ సాధించిన త్రిష లేటెస్ట్ సినిమా కధ ఇది. స్త్రీలు అంటే ద్వేషించే ఒక అసిస్టెంట్ డెరైక్టర్ జీవితంలో మార్పును తీసుకు వచ్చే ఈ నేపథ్యంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఎండ్రెండ్రుం పున్నగై’. హీరోయిన్‌గా త్రిష నటించింది. అసిస్టెంట్ డెరైక్టర్‌గా జీవా నటించారు అహ్మద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంలో ఘనవిజయం సాధించింది. దీన్ని తెలుగులో ‘చిరునవ్వుల చిరుజల్లు’ పేరుతో అనువదిస్తున్నారు. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు చెపుతున్నారు. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా త్రిష పేరు చెపితే జనం ధియేటర్లకు రాని పరిస్థుతులలో త్రిష ఈ సినిమా ద్వారా ఇక్కడ కూడా సత్తా చాటుతుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: