పవన్‌కళ్యాణ్‌ స్థాపించనున్న ‘జనసేన’ పార్టీ కార్యక్రమాలు చిన్నచిన్న అవాంతరాలు ఎదురైనా జెట్ స్పీడ్ తో ముందుకు నడిచి పోతున్నాయి. పవన్ పార్టీ ప్రచార గీతాన్ని విడుదల చేశారు. ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ సినిమాలో ‘పనైపోద్ది పనైపోద్ది’ అంటూ సాగే పాట తరహాలోనే ‘జనసేన’ పార్టీ ప్రచార గీతo రూపొందించబడింది.  గతంలో చిరంజీవి కూడా తన ‘ప్రజారాజ్యం’ పార్టీ కోసం ‘స్టాలిన్‌’ సినిమాలోని ‘యుద్ధం బెదిరే శబ్దం స్టాలిన్‌’ పాటని ఉపయోగించుకున్నట్లుగా పవన్ కూడ తన సినిమాలోని పాటను ప్రాతిపధికగా ఉపయోగించుకున్నాడు. ఈపాట మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఎన్నికల కమీషన్ అధికారి పవన్ ‘జనసేన’ పేరుతో పార్టీకి అప్లికేషన్ ఇచ్చాడు అని ప్రకటించడం ఈ ప్రకటన వచ్చిన కొద్ది సేపటికి నాగబాబు మీడియా ముందుకు వచ్చి తాను తన అన్న చిరంజీవి బాటలోనే నడుస్తానని క్లారిటీ ఇవ్వడంతో ఇప్పటి వరకు ఒకే వర్గంగా ఉన్న మెగా అభిమానులు చిరంజీవి వర్గం, పవన్ వర్గం అని అధికారికంగా విడిపోయినట్లు అయింది. దీనితో రాబోతున్న ఎన్నికలలో రెండుగా చీలిపోయిన రాష్ట్రలనే కాకుండా రెండుగా విడిపోయిన మెగా కుటుంబాన్ని కుడా సామాన్య ఓటర్ చుడబోతున్నాడు. ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ పెట్టుకున్న ‘జనసేన’ టైటిల్ నాది అంటూ బాలరాజు అనే వ్యక్తి మీడియాకు ఎక్కడంతో రేపటి క్లైమేక్స్ కధలో ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో అని ఆశక్తిగా ఆంధ్రదేశం యావత్తు ఎదురు చూస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: