విలక్షన నటుడు మెహన్ బాబు ముద్దుల కూతరు మంచు లక్ష్మి ప్రసన్న గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో హడావిడి అందరికీ తెలిసిన విషయమే. ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత ఈ అమ్మడు తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకత కల్పించుకోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తుంది. హీరోయిన్ గా, సైడ్ యాక్టర్ గా , నిర్మాతగా, టీవీ యాంకర్ గా అన్ని రంగాల్లో చురుకుగా పాల్గొంటు భేష్ అనిపించుకుంటుంది. పవన్ కళ్యాన్ నేడు కొత్త పార్టీ పెడుతున్న సందర్భంగా ఆయనకు తన మద్దతని సమాజం కోసం పాటు పడే వారికి ఎప్పడు ఎంకరేజ్ చేస్తానని చెప్పింది. ఈ సందర్భంగా తమ కుటుంబం ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నామని అయినా వాటిలో లొసుగులు ఉండటం రోజు రోజుకు రాజకీయాలు బ్రష్టు పట్టిపోయాయి కాబట్ట వాటికి దూరంగానే ఉంటున్నామని చెప్పింది. కానీ పవన్ పెట్టే పార్టీ వాటికి విరుద్దంగా ఉండాలని ప్రజల కోసం పాటు పడే పార్టీగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా పవన్ కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది మంచు వారి అమ్మాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: