లీడర్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు దగ్గుబాటి రామానాయుడు మనువడు రాణా. ఆ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాణా తర్వాత ఆ రేంజ్ లో సినిమా చేయలేదు. ఇక లాస్ట్ గా వచ్చిన కృష్ణంవందే జగద్గురుం సినిమా పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు రాణా పరశురాం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడట. యువత సినిమాతో మంచి డైరక్టర్ గా గుర్తింపుతెచ్చుకున్న డైరక్టర్ పరశురాం (బుజ్జి). ఆ తర్వాత సోలో, సారొచ్చారు సినిమాలు చేసినా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. సోలో కాస్త బెటర్ సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ డైరక్టర్ రాణాకి ఒక కథను వినిపించాడట. రాణా కి కూడా కథ నచ్చడంతో సినిమాకి ఒకే చెప్పాడని ఎపిహెరాల్డ్.కామ్ కి అందిన సమాచారం. డైరక్షన్ పరంగా సూపర్ క్వాలిటీస్ ఉన్న హీరో తన యువత సినిమాపై కాన్సెంట్రేట్ చేసినట్లుగా ఈ సినిమాపై దృష్టి పెడితే సినిమా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అటు పరశురాం, ఇటు రాణా కూడా కెరియర్ పరంగా హిట్లు లేక సతమతమవుతున్నారు కాబట్టి వీరిరువురికి ఈ సినిమా మంచి సక్సెస్ తీసుకురావాలని కోరుకుంటున్నారు సిని అభిమానులు. ఇంతకీ ఈ సినిమా ఎవరు నిర్మిస్తున్నారో తెలుసా రాణా సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. రాణా కి పరశురాం సక్సెస్ ఇస్తాడా..?     

మరింత సమాచారం తెలుసుకోండి: