ఈ మధ్య వార్తలకు దూరంగా ఉంటున్న అంజలి మళ్ళీ తన సమస్యల నుండి బయటకు వచ్చి కెరియర్ పై దృష్టి పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అనుష్క, నిత్యామీనన్‌ల తరువాత మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజలి తనకు వచ్చిన క్రేజ్ ను ఏమాత్రం తన కెరియర్ కు ఉపయోగించుకోలేకపోయింది, ఈమధ్య బాగా బొద్దుగా తయారైన అంజలి తన లుక్ ను మార్చుకోవడానికి తీవ్రంగా కష్టపడుతోంది అని టాక్. ఈ నేపధ్యంలో అంజలికి నాయికా ప్రాధాన్య చిత్రాల్లో నటించాలని ఎప్పటినుంచో కోరిక. అయితే తాజాగా ఆమెకు అలాంటి అవకాశం దక్కింది. ఇటీవలే ఓ స్త్రీ ప్రాధాన్యతా చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అంటున్నారు. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ అంజలికి విపరీతంగా నచ్చేసిందట. దాంతో వెంటనే ఆ సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపిందట అంజలి. అయితే అందరూ ఊహించినట్లు షకీలా జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమా కాదు. అందులో నిజం లేదని అంజలి ఖండించింది కూడా. ప్రస్తుతం అంగీకరించిన సినిమాలో అంజలి పాత్ర ప్రతి ఒక్కరికీ నచ్చేలా, అందరూ మెచ్చేలా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది అని తెలుస్తోంది. తన కెరీర్‌ని మరో మలుపు తిప్పే సినిమా అవుతుందని అంజలి ఆశాభావంతో ఉన్నదట. రాజోలు అమ్మాయి కోరిక ఈ యంగ్ డైరెక్టర్ ఎంత వరకు నెరవేరుస్తాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: