రాబోతున్నది ఎన్నికల సీజన్ కావడంతో టాలీవుడ్ సెలిబ్రిటీలు అంతా రాజకీయాల వైపు చూస్తున్నారు. కొంతమంది సెలిబ్రిటీలు జంప్ జిలానీలా ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి జంప్ చేస్తూ ఉంటె మరి కొంత మంది కోత్త గా రాగాకీయలలోకి వస్తున్నారు. ఈ పరిస్థుతులలో తాజాగా అల్లు అర్జున్ పేరు కూడా రాబోతున్న ఎన్నికలలో వినిపించబోతోంది. అయితే బన్నీ నేరుగా రాజకీయాలలోకి రాకున్న బన్నీ మామగారైన చంద్ర శేఖర్ రెడ్డి కూడా ఎలక్షన్స్ నిలబడటానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ,చిరంజీవి అండతో ఆయన కాంగ్రేస్ టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇబ్రహీంపట్టణం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అప్పుడే తన సన్నాహాలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు తన మామగారు కోసం కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడానికి కూడా సన్నద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను బట్టి బన్ని పరోక్ష రాజకీయ ప్రవేశానికి రంగం సిద్దం అయినట్లే అనుకోవాలి. ఇప్పటికే అటు టాలీవుడ్ సినిమాలలోనే కాకుండా అటు కాంగ్రెస్ ఇటు జనసేన రాజకీయ పార్టీల మధ్య మెగా వార్ కు రాబోతున్న ఎన్నికలు వేదక కాబోతున్నాయి ఇక త్వరలో బన్నిరాజకీయ ప్రసంగం కూడా చేయ బోతున్నాడని అనుకోవలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: