పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై ఫిల్మ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఒక్కరుగా కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఏ విధంగా చెప్పినా, ప్రతి ఒక్కరూ పవన్ పార్టీకు సపోర్ట్ గానే కామెంట్ చేయడంతో ఫిల్మ్ సెలబ్రిటీలు అందరూ ఏదో ఒకరోజు పవన్ కి సపోర్ట్ గా ఒకేతాటిపైకి వచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్ గా రచయిత, నటుడు తనికెళ్ళ భరణి పవన్ పార్టీపై కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన సమాచారన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ‘సామాజికంగా అవగాహన ఉన్న ఓ తెలివైన వ్యక్తి రాజకియలోకి వస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్నకు త్వరలో పవన్ ద్వారా సమాధానం వస్తుంది. పవన్ ప్రసంగం నేను చూసాను, పవన్ కి సాహిత్యం పై ఉన్న పరిజ్ఞానము, ముఖ్యంగ పోతన పద్యాలను పవన్ చెప్పిన విధానం నన్ను చాల ఆకట్టుకునాయని,’ అంటూ జనసేన పార్టీ గురించి చెప్పారు. సమాజంలో మార్పు తీసుకురావటానికి పవన్ తహతహ లాడుతున్నాడని భరణి కామెంట్ చేశాడు. తనికెళ్ళభరణి ప్రజారాజ్యం పార్టీపై ఏనాడు కామెంట్ చేయలేదు. కాని పవన్ కళ్యాణ్ పార్టీపై కామెంట్ చేయండతో ఇండస్ట్రీలోని పలువురు పెద్దలను భరణి ఎట్రాక్ట్ చేశాడు. తనికెళ్ళ భరణి ఎందుకిలా స్టేట్ మెంట్ ఇచ్చాడో అంటూ ఆలోచిస్తున్నారు. తనికెళ్ళ భరణిను చూసిన కొందరు సెలబ్రిటీలో త్వరలోనే పవన్ పార్టీపై వారి అభిప్రాయాలన చెప్పే అవకాశం ఉందంటున్నారు. జనసేన పార్టీపై తనికెళ్ళ భరణి చేసిన కామెంట్స్ నిజమేనా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను తెలియపరచండి.

మరింత సమాచారం తెలుసుకోండి: