రాజోలు బ్యూటీ తెలుగు తెర సీతమ్మ తన పై వస్తున్న విమర్సలకు తన కొత్త లుక్ తో సమాధానం ఇస్తోంది. అందర్నీ ఆశ్చర్య పరుస్తూ అంజలి స్లిమ్‌గా, నాజూగ్గా మారిపోయింది. ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’ లో సీతగా నటించినప్పుడు కాస్త బొద్దుగా ఉండేది. అయితే ఆ తరువాత వచ్చిన వెంకటేష్ ‘మసాల’ లో కాస్త ఏజ్డ్ మహిళ గా కనిపించడంతో ముఖ్యంగా తెలుగులో ఆఫర్లు తగ్గాయి. అదీకాకుండా ఆమె వ్యక్తిగత జీవిత సమస్యలు కూడ ఆమె గ్లామర్ పై ప్రభావాన్ని చూపించాయి. తమిళ తంబీలు ఆదరించినప్పటికీ టాలీవుడ్‌లో అంజలిని అక్కున జేర్చుకున్నవాళ్లెవరూ అంతగా లేకపోవడంతో ఇక ఇలా కాదని, జిమ్‌కి వెళ్తూ.. ఓవర్ వెయిట్‌ని తగ్గించుకుంటోందని టాక్ ! దాదాపు 8 నుంచి 10 కిలోల బరువు తగ్గి నాజూగ్గా తయారయింది అంజలి. దీంతో ఇటీవలే తన ఫ్రెష్ ఫోటోల్ని మీడియాకి అంజలి రిలీజ్ చేసింది. కొత్త రూపుతో ఉన్న అంజలి అప్పుడే ఒక యంగ్ డైరెక్టర్ తీస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. ఈ మూవీలో రెండు ‘ షేడ్స్’ ఉన్న రోల్‌లో నటించబోతోందట ! ఒక షేడ్‌లో గ్లామరస్‌గా, మరో దాన్లో సంప్రదాయబద్ధంగా ఉండే పాత్రలో అంజలి కనిపించబోతోంది. ఈ చిత్రం వివరాలు త్వరలోనే తెలుస్తున్నాయని అని అంటున్నారు. లుక్ మారింది కాబట్టి అంజలి యూత్ ను ఎంత వరకు ఆకర్షిస్తుందో చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: