పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకు  మద్దతుగా టాలీవుడ్ లోని ఓ రెబల్ ఫ్యామిలి ముందుకొచ్చిందని టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. టాలీవుఢ్ లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం మంచు ఫ్యామిలి తాజాగా తిరుమల దర్శనం చేసుకుంది. అనంతరం మీడియాతో ప్రస్తుత రాజకీయాల గురించి మోహన్ బాబు క్లుప్తంగా మాట్లాడాడు. ప్రస్తుత రాజకీయాలు అవినీతితో, బిర్యాని పాకెట్లతో నిండిపోయింది. వీటిని కడిగిపారేయాల్సిన అవసరం వచ్చింది. అందుకే ప్రతి ఒక్కరూ ఇప్పుడు మేలుకోవాలి. అలాగే మంచు మోహన్ బాబు తన పొలిటికల్ స్టెప్ ను ఏ విధంగా తీసుకుంటాడు అనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నాడు అని చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం మోహన్ బాబు జనసేన పార్టీలో జాయిన్ అవుతాడని అంటున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో మోహన్ బాబు కలిసి, పార్టీలో జాయిన్ అవ్వటానికి ఆసక్తి కనబరిచినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే పవన్ పార్టీలో ఓ డైలాగ్ కింగ్ ఉన్నట్టే అని అంటున్నారు. అయితే దీనిపై మోహన్ బాబు తుది నిర్ణయం ఈ వారంలోనే తీసుకునే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు వస్తున్నాయి. పవన్ పార్టీలో మోహన్ బాబు జాయిన్ అయితే, పార్టీకు మంచిదా? కాదా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను తెలియపరచండి.

మరింత సమాచారం తెలుసుకోండి: