క్యూట్ హీరోయిన్ సమంత పై మళ్ళీ గట్టిగా గాసిప్స్ మొదలయ్యాయి. ఆమె రీసెంట్ గా లండన్ లో చికిత్స పూర్తి చేసుకుని వచ్చినట్లుకోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి . సమంతకు చాలా కాలంగా స్కిన్ ఎలర్జీ పట్టి పీడిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఆ స్కిన్ ఎలర్జీతో ఆమె గతంలో శంకర్,మణిరత్నం చిత్రాలు సైతంఆమె వదులుకుంది ఈ నేపధ్యం లో ఈ మధ్యన ఆమె తమిళ చిత్రం ‘అంజాన్’ షూటింగ్ లో ఉండగా ఆమెకు మళ్లీ స్కిన్ ఎలర్జీ వచ్చింది అని వార్తలు వచ్చాయి. దాంతో షూటింగ్ గ్యాప్ ఇచ్చి లండన్ లో చికిత్స చేయించుకుని వచ్చింది అని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఈ చికిత్సతో సమంతకు ఈ సమస్య శాశ్వతంగా తొలిగినట్లే అని అంటున్నారు. ఆ మధ్యన సమంత తన నిర్మాతలతో, దర్శకులతో తాను ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించి షూటింగ్ ల మధ్య గ్యాప్ తీసుకుని లండన్ వెళ్లి వచ్చింది దీనికోసమే అనుకోవాలి. ఆరోగ్య సమస్యలు తీరిపోయాయి కాబట్టి సమంత మరింత ఉత్సాహంగా మన యంగ్ హీరోలతో రోమాన్స్ చేస్తుంది అనుకోవాలి.  ఈ వార్తలు ఇలా ఉండగా సమంత ఈమధ్య బాలీవుడ్ లో విజయవంతమైన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ‘క్వీన్’ సినిమాను తన ప్రియ నేస్తం సిద్దార్ద చేత నిర్మింపచేసి దక్షిణాది హీరోయిన్స్ లో క్వీన్ గా మెరవాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: