టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొంత కాలం క్రితం టాప్ హీరోయిన్ గా కొనసాగిన తమన్న, 2013వ సంవత్సరంలో మాత్రం సాధారణ అవకాశాలకి కూడ దూరమైపోయింది. ఇదిలా ఉంటే 2014లో మాత్రం తమన్నకి అనూహ్యంగా అవకాశాల వరద పెడుతుంది. దీంతో సమంత ఎప్పటిలాగే నెంబర్ వన్ స్థానానికి పోటీ పడే లిస్ట్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కి తమన్న హీరోయిన్ ఎంపికయ్యింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎఫిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ క్లియర్ న్యూస్ ప్రకారం తమన్న కిక్2 మూవీలో హీరోయిన్ గా సెలక్ట్ అయింది. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ బయటకు రాకపోయినా, దాదాపు ఈ న్యూస్ వంద శాతం నిజమే అని అంటున్నారు. దీంతో రవితేజ సరసన కిక్2 మూవీలో తమన్న రొమాన్స్ చేయటానికి సిద్ధంగా ఉంది. బలుపు మూవీ తరువాత రవితేజ మూవీల సెలక్షన్స్ ను చాలా జాగ్రత్తగా సెలక్ట్ చేసుకుంటున్నాడు. అందుకే వరుస మూవీలు చేయకుండా, ఒక మూవీ తరువాత ఒకటి ఒప్పుకుంటూ వెళుతున్నాడు. సురేందర్ రెడ్డి ప్రస్తుతం రేసుగుర్రం మూవీ రిలీజ్ కి సంబంధించిన పనుల్లో బిజిగా ఉన్నాడు. కిక్2 మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకోవటం ఖాయం అనే ధీమాతో ఉన్నాడు. కిక్2 మూవీలో రవితేజా సరసన తమన్న కాంబినేషన్ బాగుంటుందా? ఈ టాపిక్ కి సంబంధించిన న్యూస్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: