ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ ను ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ అవమాన పరిచాడు అనే వార్తలు ఫిలింనగర్ లో గుప్పు మంటున్నాయి. ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న సమాచారం మేరకు సంగీత దర్శకుడు తమన్ వ్యవహార శైలితో చంద్రబోస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని అంటున్నారు. అందువలననే ఈ మధ్యన జరిగిన ‘రేసుగుర్రం’ ఆడియో వేడుకకు కూడ చంద్రబోస్ రాలేదని అంటున్నారు.  ఈ వివాదానికి గల ప్రధాన కారణం చంద్రబోస్ ‘రేసు గుర్రం’ సినిమా కోసం రాసిన ‘బూచోడు బూచోడు’ అని అంటున్నారు. చంద్రబోస్ రాసిన ఈ పాటలోని ఒక చరణాన్ని పూర్తిగా మార్చి వేసి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రికార్డు చేయించాడట. అంతేకాదు తన పాటలో మార్పులు చేస్తున్నట్లుగా కూడ సంగీత దర్శకుడు తమన్ కాని సినిమా దర్శకుడు సురేంద్ర రెడ్డి కాని చంద్రబోస్ కు మర్యాదకైనా తెలపక పోవడం తీవ్ర అవమానంగా భావిస్తున్నాడట చంద్రబోస్. ఈ మధ్య కాలంలో సంగీత దర్శకుడు తమన్ చాలామంది గేయ రచయితలతో కొద్దిగా పోగరగా వ్యవహరిస్తూ ఇలా వివాదాలలో చిక్కుకుంటున్నాడు అనే వార్తలు వినపడుతున్నాయి. గడిచిన ఆదివారం విడుదలైన ‘రేసుగుర్రం’ పాటలు బన్నీ అభిమానులకు కూడా నచ్చని స్థితిలో ఉండటంతో తమన్ తన శైలి మార్చుకాకపోతే సమస్యలలో పడే అవకాసం ఉంది అంటూ మాటలు వినిపిస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: