పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్ధాపించిన జనసేన పార్టీను ఎదుర్కోవటానికి పలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. పవనిజం ను టచ్ చేస్తే ఎటువంటి దుష్ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుందో అంటూ గత కొద్ది రోజులుగా ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని తెగ ఆలోచనలు పడ్డాయి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ పొత్తులకు సిద్ధం అనడంతో అనవసరంగా ఎందుకు నోరుపారేసుకోవడం అంటూ పొలిటికల్ లీడర్స్ పొత్తు మేటర్ తెలిసేంత వరకూ సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ, బిజెపికి మధ్దతు అని తెలియడంతో మిగతా పార్టీలు అన్ని పవన్ పై కౌంటర్స్ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. ఇందులో ప్రధానంగా వ్యక్తిగత విషయాలు, ఎజెండా లేని పార్టి విధానాలే ప్రధాన ఆయుధాలుగా చేసుకోబోతున్నారు. టాలీవుడ్ లో ఓ బడా హీరో, సన్నిహితులకు చెబుతున్న సమాచారం మేరకు ‘పవన్ కళ్యాణ్ ను లీగల్ గా ఇరిక్కించేందుకు వ్యూహ రచన జరుగుతుందని, తనకు రాజకీయ నాయుకుల వద్ద నుండి సమాచారం అందిందని’ అంటున్నాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్, బిజిపి కి మద్దతు ఇచ్చి ఏ విధమైన సిద్ధాంతాలతో ఎలక్షన్స్ లోకి వెళతాడో అనేది ముందు ముందు చూడాలని సాధారణ సినీ ప్రేక్షకుడితో పాటు, సామాన్య జనంలోనూ ఆసక్తిని రేకిత్తిస్తుంది. పవన్ కళ్యాణ్ ను లీగల్ ఇబ్బందులు పెట్టటానికి ఏ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: