1965 సంవత్సరంలోనే సినిమా పరిశ్రమలో కొత్త పోకడలతో కొత్త కొత్త టెక్నాలజీ ఉపయోగించి సిఐడీ చిత్రాన్ని ఒక డిటెక్టీవ్ సినిమా తరహాలో రూపొందించారు నాగిరెడ్డి మరియు చక్రపాణి. తాపి చాణక్యుడు దర్శకత్వంలో నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) ఒక సీఐడి పాత్ర పోషించడం ఆ పాత్రకు సరిపడే ఎనర్జీని హావభావాలు ఎంతో చక్కగా ప్రదర్శించడం నాటి సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆధరించారు. ఎంతో మధురమైన పాటలు ఇందులో ఉన్నాయి. ఎన్టీఆర్ సరసన జమున నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో గుమ్మడి వెంకటేశ్వరరావు చాలా అద్భుతమైన ప్రదర్శన కనబర్చినారు. ఇంకా రమణారెడ్డి చేసిన హాస్యం అంతా ఇంతా కాదు. సినిమా సంగీతం శ్రీ వెంకటేశ్వరరావు  అందించారు. మరో ముఖ్య విషయం ఘంటసాల నేపద్య గానం చాలా అద్భుతంగా ఉంది నేటికీ ఈ పాటలు హిట్ గానే నిలిచాయి. ఈ సినిమా నిడివి 172 నిమిషాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: