కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందిన సమాచారం మేరకు సమంత తన పర్సనల్ మేనేజర్ ను చివాట్లు పెట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ప్రస్తుతం సమంత, సూర్య సరసన అంజాన్ మూవీలో నటిస్తుంది. అంజాన్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సమంత ఎన్నడూ లేనంతగా ఈ మూవీలో ఎక్స్ పోజింగ్ ను ఇస్తుంది. దీంతో అంజాన్ మూవీకై కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోనూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో సమంతా అందాలు ఏ రేంజ్ లో ఉంటాయో అంటూ సిని ప్రేక్షకులు ఇప్పటి నుండే ఆసక్తిని చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే అంజాన్ మూవీ కోసం సమంత తీసుకున్న రెమ్యునరేషన్ అక్షరాల 85 లక్షల రూపాయలు. అయితే ఇదే మూవీలో బాలీవుడ్ బ్యూటి చిత్రాంగద సింగ్ తో ఓ ఐటెం సాంగ్ ను చేయించారు. అందకు తనకు ఇచ్చిన రెమ్యునరేషన్ 65 లక్షల రూపాయలు. మూవీ కోసం ముఫ్పై రోజులు కష్టపడినందుకు వచ్చింది 85 లక్షలు రూపాయలు అయితే, ఒక్క ఐటెం సాంగ్, రెండు రోజుల షూటింగ్ కోసం తనకు ఇచ్చింది 65 లక్షలు రూపాయలు అంటూ లెక్కలు వేసుకున్న సమంత, ఇంత తక్కువ రెమ్యునరేషన్ కు డీల్ కుదుర్చుతావా? ఎలాగైన మరో 15 లక్షలు రెమ్యునరేషన్ ను నిర్మాత నుండి డిమాండ్ చేయమని తన పర్సనల్ మేనేజర్ ని చివాట్లు పెట్టిందట. సమంతకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ ఉందంటారా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: