తను చేసిన మొదటి సినిమా నుండి కొందరు హీరోలు కొన్ని సెంటిమెంట్ లు పాటిస్తుంటారు. అలానే బద్రి సినిమా నుండి పవన్ కళ్యాన్ అలిని సెంటిమెంట్ లా భావిస్తాడు. ఇకపోతే ఈ సెంటిమెంట్ కేవలం ఆ కమెడియందే కాదు మన పవర్ స్టార్ కి కూడా ఉంది. మరి రీసెంట్ గా పార్టి పెట్టి నానా హంగామా చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాన్ కి ఇండస్ట్రీ నుండి మంచి సపోర్ట్ వచ్చింది. కాని తనని మంచిగా అభిమానించే అలి సపోర్త్ మాత్రం రాలేదు. ఆడియో ఫంక్షన్ లో కూడా అలి నా గుండెకాయ అనేంత సాన్నిహిత్యం ఉన్న అలి పవన్ కళ్యాన్ లు.. పవన్ పార్టి పెట్టి ప్రత్యర్ధులకు సవాల్లు విసురుతుంటే అలి సైలెంట్ గా ఎందుకు ఉన్నట్లు. ఒకవేళ అలి కి పవన్ ని సపోర్ట్ చేయడం ఇష్టం లేదా. ఒకవేళ అలా చేస్తే చిరంజీవిని ఇన్ డైరెక్ట్ గా ఇన్ సల్ట్ చేసినట్లవుతుందని ఏమన్నా వెనుకడుగు వేశాడా అన్నది తెలియాల్సి ఉంది.  ఎపిహెరాల్డ్.కామ్ కి అందిన ఎక్స్ క్లూజివ్ సమాచారం ప్రకారం అలి టీ.డి.పీ లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని ఫిల్మ్ నగర్ వార్త. సో ఈ కారణం చేతనే అలి పవన్ కి సపోర్ట్ చేయట్లేదేమోనని అనుకుంటున్నారు అందరు. ఇకపోతే ఇంకో కమెడియన్ వేణు మాధవ్ కూడా టి.డి.పి తీర్ధం పుచ్చుకుని పవన్ పార్టీపై తన అభిప్రాయాన్ని వెళ్ళడించాడు. వేణు అంటే పవన్ కి కాస్త దూరం కాబట్టి దాన్ని అంతగా పట్టించుకోలేదు కాని అలి అలా చేస్తే కొంచం తేడా వస్తుందని అనుకున్నాడో ఏమో ఏ పని చేయలేక ఖాళీగా కూర్చున్నాడు అలి. సో మొత్తానికి పవన్ పార్టి అటు హీరోలనే గాక, కమెడియన్ లను కూడా ఆలోచనలో పడేసిందని చెప్పాలి. ఈ జనసేన పార్టి ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం. అలి నిజంగా పవన్ కి సపోర్ట్ చేస్తాడా..?       

మరింత సమాచారం తెలుసుకోండి: