పవన్ కళ్యాణ్ రాజకీయరంగా ప్రవేశం తరువాత చిరంజీవి బయటకు ఎన్ని మాటలు చెప్పినా మెగా కుటుంబంలో వచ్చిన భేదాలు రీత్యా మెగా ఫ్యాన్స్ చిరంజీవి వర్గంగా, పవన్ వర్గంగా నిట్ట నిలువుగా చీలి పోయింది అన్నది సుస్పష్టం. ఈ సంఘటన తరువాత మెగా కుటుంబ సినిమాలేవీ విడుదల కాలేదు కాని ఏప్రియల్ మొదటి వారంలో విడుదల కాబోతున్న ‘రేసుగుర్రం’ సినిమా భవిష్యత్ పై మెగా అభిమానులలో వచ్చిన చీలిక ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే కోస్తా ప్రాంతంలో ప్రచారం చేస్తున్న చిరంజీవి పై మెగా అభిమనులలోని ఒక వర్గం ఎక్కడికక్కడ టార్గెట్ చేస్తూ చిరంజీవికి చుక్కలు చూపెడుతున్నారు. ఈ పరిస్తుతులను పట్టించు కోకుండా చిరంజీవి తన శక్తి మేరకు పవన్ పై రాజకీయ సెటైర్లు వేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి పవన్ పై వేస్తున్న సెటైర్లు కాంగ్రెస్ కు ఓట్లు తెస్తాయో లేదో తెలియదు కాని పవన్ వీరాభిమానులకు మాత్రం తీవ్ర కోపాన్ని తెప్పిస్తున్నాయని టాక్. దీనికి తోడు ‘రేసుగుర్రం’ ఆడియో వేడుకలో అల్లుఅర్జున్ పవన్ ను దృష్టిలో పెట్టుకుని తనకు గుండెకాయ లాంటి వ్యక్తి చిరంజీవి అనడం పవన్ అభిమానులను మరింత భాదించింది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో పవన్ వీరాభిమానులు తమ కోపాన్ని అసహనాన్ని వచ్చే నెలలో విడుదల కాబోతున్న ‘రేసుగుర్రం’ సినిమా పై చూపెడితే మెగా అభిమానులలో వచ్చిన చీలిక వల్ల ఆసినిమా ఓపినింగ్స్ ఘోరంగా దెబ్బ తింటాయి అని అంటున్నారు విశ్లేషకులు. బయటకు వస్తున్న ఈ వార్తలు బంనీని కూడ కలవార పెడుతున్నాయి అని ఫిలింనగర్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: