కమలహాసన్ ఒకనాటి భార్య సారిక తన కుమార్తెలను హీరోయిన్స్ గా తీర్చి దిద్దే పనిలో ప్రస్తుతం ముంబాయ్ లో ఉంటోంది. పెద్దకూతురు శ్రుతితో ఎటువంటి సమస్యలు లేని సారికకు తన చిన్న కూతురు అక్షర తో అన్నివిధాల టార్చర్ పడుతోంది అంటు బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. తన అక్కను ఆదర్శంగా తీసుకుని అక్షర సినిమాలలో నటిస్తున్నా గాసిప్పులు విషయంలో మటుకు శ్రుతిని మించిపోయింది అక్షర. ప్రస్తుతం ధనుష్ సరసన ఓ హిందీ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది అక్షర. బాల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అక్షర కెరియర్ ఎలా ఉండాలి.. ఎలా స్టార్ ను చేయాలని అని శృతి తల్లి సారికా చాలా ఆరాటపడుతుంటే.. అక్షర మాత్రం ప్రేమ, ఫ్రెండ్ షిప్ అంటూ తన బాయ్ ఫ్రెండ్ తో తెగ ఎంజాయ్ చేస్తుందని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. నటుడు తనుజ్ విర్వానీతో అక్షర ప్రేమలో పడిందని బాలీవుడ్ మీడియా కధనం. ప్రస్తుతం అక్షర ఇతగాడితో చెట్టాపట్టాలేసుకుని పబ్బులు చుట్టూ తెగ తిరుగుతోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే తల్లి సారిక మాత్రం ముందు కెరీర్ పై దృష్టి పెట్టు.. తర్వాత ప్రేమ వ్యవహారం అని కూతురికి అడ్వయిజ్ చేస్తున్నా.. అక్షర మాత్రం తల్లి మాట వినకుండా తనుజ్ తో డేటింగ్ చేస్తోందట. ఈ వ్యవహారం విన్న శ్రుతి కూడ ఏమిచేయలేక అక్షర స్పీడ్ ముందు తట్టుకోలేకపోతోంది శ్రుతి అని బాలీవుడ్ టాక్. త్వరలో అఖిల్ పక్కన అక్షర నాటించబోతోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈమె స్పీడ్ కు అఖిల్ ఎలా తట్టుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: