దక్షిణాది సినిమా రంగంలో సమంత తరువాత ఎదో ఒక వివాదంలో తల దూర్చి ఎప్పుడూ న్యూస్ లో ఉంటుంది హన్సిక. ఇటీవల ఈ ముద్దుగుమ్మ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. తెలుస్తున్న సమాచారం మేరకు హన్సిక చెన్నయ్‌కి చెందిన ఓ క్యాబ్ కంపెనీ ప్రారంభోత్సవానికి అతిథిగా వెళ్లడానికి అంగీకారం తెలిపిందట. దీనికోసం హైదరాబాద్ నుంచి హన్సిక అండ్ టీమ్ చెన్నయ్ వెళ్లడానికి సదరు క్యాబ్ కంపెనీ వారు కొన్ని ఫ్లయిట్ టికెట్స్ కూడా బుక్ చేశారట. అయితే చివరి నిమిషంలో మరో అయిదు టికెట్స్‌ని బుక్ చేయమని క్యాబ్ కంపెనీ వారిని హన్సిక రిక్వెస్ట్ చేసింది అని టాక్. ఆర్థిక భారం అధికమవుతుండటంతో ‘ఇక ఫ్లయిట్ టికెట్స్ తీయలేం’ అని క్యాబ్ కంపెనీవారు కరాఖండీగా చెప్పేశారట ఈ ముద్దు గుమ్మకు. అనుకోని ఈ సమాధానం హన్సికకు బాధ కలిగించిందో ఏమో.. అసలు ఓపెనింగ్‌కే ఎగనామం పెట్టేసింది. తమ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హన్సిక రాబోతున్నారని ఓ రేంజ్‌లో పబ్లిసిటీ చేసుకున్న ఆ సంస్థ హన్సిక హ్యాండివ్వడంతో ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యారు. పైగా ఆహ్వాన పత్రికల్లో కూడా హన్సిక పేరు వేయడంతో వారు అవమానంగా కూడా ఫీలయ్యారట. అంతేకాదు ‘బాధ్యత కలిగిన సెలబ్రిటీ చేయాల్సిన పని కాదిది’ అంటూ హన్సికపై మీడియా దాడి మొదలు పెట్టారు.. అయితే ఈ విషయంపై హన్సిక స్పందన వేరేలా ఉంది. తాను ప్రారంభోత్సవానికి హాజరవుతాననడం నిజమేనని, అయితే తన స్టిల్స్‌ని మాత్రం సదరు కంపెనీ వారు ప్రచారానికి ఉపయోగించుకోకూడదని ముందే షరతు విధించానని ఆమె చెపుతోంది. అయితే దాని తాలూకు ఒప్పంద పత్రాన్ని హన్సికకు అందజేయలేదట. దీనితో తిక్కరేగి హ్యాండ్ ఇచ్చాను అంటోంది హన్సిక. ఏది ఎలా ఉన్నా తరాలను నమ్ముకుని వ్యవహారాలు చేస్తే ఇలాగే ఉంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: