పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కు సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్, అభిమానులకు అన్యాయం చేశాడని సర్వత్రా టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ప్రస్తుతం సమాచారం ప్రకారం నిన్న జరిగిన వైజాగ్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్, తను అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయడం లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. దీంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహానికి వెళ్ళిపోయారు. ప్రశ్నించటానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కనీసం ఒక్క సీటు కోసం అయినా పోటీ చేసి, అసెంబ్లీను కడిగిపారేస్తే చూడాలని అభిమానుల కోరిక. అలాంటిది అసెంబ్లీ ఎలక్షన్స్ లో పాల్గొనటం లేదంటే అందరూ నిరుత్సాహపడిపోయారు. అయితే అంతలోనే తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం కాయం అని చెప్పకనే చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ తీసుకున్ నిర్ణయం ఓ రకంగా మంచిదే అయినప్పటికీ, మరో రకంగా అభిమానులకు రాజకీయాలపై ఓ సమగ్ర అవగాహన ఏర్పడటానికి ఈ సమయం సరిపోతుందని అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ తో పాటు అభిమానులు కూడ ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిదా? కాదా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: