టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీను ఆసక్తి రేపిన మూవీ లెజెండ్. లెజెండ్ మూవీపై నందమూరి బాలక్రిష్ణ అంచనాలకు మించిన ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే లెజెండ్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయన్నదే టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నందమూరి బాలక్రిష్ణ, ఈ వయస్సులోనూ తన మూవీలతో రికార్డ్ లను బ్రేక్ చేస్తాడా అనే ఆలోచన అందరిలోనూ ఉంది. ఇదిలా ఉంటే లెజెండ్ మూవీ మొదటి రోజు బాక్సాపీస్ రిపోర్ట్ ను ఎఫిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందిన విశ్వశనీయమైన రిపోర్ట్ ప్రకారం లెజెండ్ మూవీ మొదటి రోజు బాక్సీపీస్ రిపోర్ట్ 11 కోట్ల రూపాయాలుగా తేలింది. నైజాంలో 2 కోట్లు, ఆంధ్రా 4 కోట్లు, సీడెడ్ 3, ఇతర ప్రాంతాలు 1 కోటి రూపాయలుగా లెక్క తేలింది. మొత్తం కలెక్షన్స్ చూసుకుంటే దాదాపు 11 కోట్ల రూపాయల వరకూ వచ్చి ఉండవచ్చని అంచనా. లెజెండ్ మూవీ కచ్ఛితంగా 40 కోట్ల రూపాయలను చాలా ఈజీగా క్రాస్ చేస్తుందని టాలీవుడ్ అంటుంది. అయితే లెజెండ్ మూవీకు ఇక సీక్వెల్స్ ఉండబోవనే వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను, బాలయ్యకు మరో కొత్త స్టోరీను వినిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. లెజెండ్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ధుమ్ము దులిపిందా? లేదా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: