నయనతార, ప్రభుదేవాతో ప్రేమాయణం తరువాత వీరిద్దరు ఒకటికావాలనుకున్న నిర్ణయాన్ని యావత్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తప్పపట్టింది. వీరిద్దరి వ్యవహారం చివరకు రజనీకాంత్ వరకూ వెళ్ళి, రజనీకాంత్ స్వయంగా కలగచేసుకొని, వీరిద్దరి ప్రేమ వ్యవహారం తమిళ సంప్రదాయమని కాదంటూ తీర్పు చెప్పటం, తరువాత ఇద్దరూ విడిపోవడం జరిగిపోయాయి. ఆ సమయంలో మూవీలకు గుడ్ భై చెప్పిన నయనతార, వెంటనే సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో నయనతార ఎక్స్ ఫోజింగ్ ఉన్న పాత్రలను చేస్తూనే, స్టోరి ఓరియంటెడ్ మూవీలూ చేస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం నయనతార ఇదే సంవత్సరం చివరిలో పెళ్ళి చేసుకోవటం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార, చెన్నైకు చెందిన ఓ బిజినెస్ మెన్ ను పెళ్ళి చేసుకోవచ్చనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై నయనతారను ఓ కోలీవుడ్ రిపోర్ట్ అడిగితే, అందుకు కాలమే సమాధానం చెబుతుంది అంటూ ఓ భారీ డైలాగ్ ను నయనతార చెప్పింది. దీంతో కోలీవుడ్ మీడియా, నయతారకు తారకు పెళ్ళి ఖాయం అని ఫిక్స్ అయిపోయింది. ప్రభుదేవాను మర్చిపోయి నయనతార పెళ్ళి చేసుకుంటుందా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: