నందమూరి తారక రామారావు చనిపోయి దశాబ్దాలు గడిచిపోతు ఉంటే ఇప్పుడు ఆయన ప్రస్థావన అ అని అనుకుంటున్నారా! బాలయ్య ‘లెజెండ్’ లో సీనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. కానీ మన రాష్ట్రంలో ప్రదర్శింపబడుతున్న ‘లెజెండ్’ సినిమాలో మాత్రం ఆయన కనిపించడు. అమెరికాలో ప్రదర్శింప బడుతున్న ‘లెజెండ్’ లో మాత్రం సీనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఆనాటి నంద‌మూరి తార‌క రామారావు 1982లో పార్టీ స్థాపించిన త‌ర‌వాత ఆయ‌న రాష్ట్రమంతా విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌లు చేశారు. వంద‌లాంది బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొన్నారు. ఆ విజువ‌ల్స్ లెజెండ్‌ లో వాడుకొన్నారు. అయితే అవి ఎక్క‌డా రాష్ట్రంలో ‘లెజెండ్’ సినిమాను ప్రదర్శిస్తున్న ధియేటర్లలో క‌నిపించ‌లేదు. ఈ సీన్స్ ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే ప్ర‌త్యేకంగా కనిపిస్తున్నాయి.  మ‌న రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్నందున‌, స‌ద‌రు స‌న్నివేశాలు తెదేపా కి అనుకూలంగా ఉన్నాయ‌న్న‌ సెన్సార్ అభ్యంత‌రంతో లెజెండ్ లో ఎన్టీఆర్‌ కి సంబంధించిన విజువ‌ల్స్ ఇక్క‌డ తొల‌గించారు. అయితే వాటిని య‌ధాత‌ధంగా ఓవ‌ర్సీస్ లో ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పార్టీకి సంబంధించిన డైలాగుల్లో ఇక్క‌డ బీప్‌లు వినిపించాయి. కానీ అమెరికా ప్రేక్ష‌కులు మాత్రం వాటినీ ఆస్వాదిస్తున్నారు. చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నా నందమూరి తారక రామారావుకు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు అమెరికాలో కూడ ఈ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడికి అమెరికాలో ఎంత క్రేజ్ ఉందో ఈ విషయం మరొకసారి రుజువు చేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: