టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడు నటకిరిటీ రాజేంద్రప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ కామెడీలు చేస్తూనే హీరోగా పలు మూవీల్లో నటించాడు. అలాగే ఈ మధ్య కాలంలో కథా బలంతో సామాజిక బాధ్యత కలిగిన ఉన్న మూవీలను చేస్తు వస్తున్నాడు. ఇదిలా ఉంటే రాజేంద్రప్రసాద్ కి ఇప్పుడు ఇండస్ట్రీలో లక్కీ ఆఫర్స్ పెరిగిపోయాయి. జులాయి మూవీలో రాజేంద్ర ప్రసాద్ నటనకు, తనకి చాలానే ఆఫర్స్ వస్తున్నాయి. అయితే వచ్చిన ఆఫర్స్ అన్నింటిని రాజేంద్ర ప్రసాద్ అంగీకరించటంలేదు. ముఖ్యంగా పెద్ద హీరోల మూవీలో కీలక రోల్స్ ను, ఫ్యామిలి రోల్స్ ను మాత్రమే రాజేంద్రప్రసాద్ అంగీకరిస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే రాజేంద్రప్రసాద్ కి అఫర్స్ వెల్లువగా వస్తున్నాయని ఇండస్ట్రీ అంటుంది. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్, ఆగడు మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దూకుడు మూవీలో మహేష్ బాబుకి తండ్రి గా చేసిన ప్రకాష్ రాజ్ పాత్ర తరహాలోనే ఆగడు మూవీలో మహేష్ కి రాజేంద్ర ప్రసాద్ తండ్రిగా చేస్తున్నాడు. మొత్తంగా రాజేంద్రప్రసాద్ కి మంచి కాలం వచ్చిందని టాక్. ఆగడు మూవీలో ప్రకాష్ రాజ్ ను తీసుకోకపోవటానికి కారణం ఏమిటి? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: