టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత సంవత్సర కాలం వరకూ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగిన తమన్న, ప్రస్తుతం మాత్రం అవకాశాల కోసం తెగ వెతుకులాట ప్రారంభిస్తుంది. ఉన్న అవకాశాలన్నీ సమంత ధక్కించుకుంటుంటే తమన్న మాత్రం కొన్ని మూవీలకే పరిమితం అవుతుంది. ఆ విధంగా తమన్న ప్రస్తుతం తెలుగులో ఓ రెండు మూవీలలో నటిస్తుంది. ఇదిలా ఉండే హీరోయిన్ గా నటించాల్సిన మూవీలో తమన్న ఐటెం సాంగ్ చేస్తుంది. వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో సమంత హీరోయిన్ గా చేస్తుంది. బెల్లంకొండ సురేష్ తనయుడు ఫిల్మ్ ఇండస్ట్రీకు పరిచయం అవుతున్న ఈ మూవీలో మొదటగా సమంత, తమన్న హీరోయిన్స్ గా చేయాలి. తమన్న డేట్స్ బిజిగా ఉండటంతో సమంత కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొని, డెబ్యూ హీరో సరసన హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పుడు ఇదే మూవీలో తమన్న ఓ ఐటెం సాంగ్ చేస్తుంది. అందుకు దాదాపు 65 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తమన్న రెమ్యునరేషన్ చూసిన సమంతకి ఒళ్ళు మండిపోతుందట. మూవీ మొత్తానికి హీరోయిన్ గా చేసినందుకు కోటి రూపాయలు, కేవలం ఒక్క ఐటెం సాంగ్ చేసినందుకు 65 లక్షలా అని అంటుందట. మొత్తానికి తమన్న చేస్తున్న ఐటెం సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అంటున్నారు. తమన్న ఐటెం సాంగ్ కోసం 65 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వటం సరైనదేనా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: