కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ గా తెరకెక్కుతున్న మూవీ ఐ. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ మూవీలో విక్రమ్ అద్భుతమైన నటనను చూపాడని చిత్ర యూనిట్ చెబుతుంది. అంతే కాకుండా మొదటి దశలో రెడీ అయిన ఫైనల్ అవుట్ పుట్ ను నిర్మాత తన సొంత ఇంట్లోనే చూసుకొని, మూవీ వచ్చిన తీరుకు అమితానందాన్ని పొందుతున్నాడు. శంకర్ విక్రమ్‌ను అన్నియన్ చిత్రంలో మూడు పాత్రల్లో చూపించి అదుర్స్ అనిపించారు. ఈ ‘ఐ’ చిత్రంలో విక్రమ్‌ను ఆరు గెటప్‌లలో చూపించి మరో సారి విక్రమ్ ప్రతిభను అద్భుతంగా చూపించాడని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ అన్నాడు. ఇందులో విక్ర మ్ కళాశాల యువకుడిగా, బాడీ బిల్డర్‌గా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారని చెప్పారు. ఈ పాత్రల పోషణ కోసం విక్రమ్ చూపిన అంకితభావం మాటల్లో చెప్పలేనన్నారు. పాత్ర స్వభావాన్ని బట్టి నటుల నుంచి అభినయాన్ని రాబట్టడంలో, వారి పాత్ర రూపకల్పన లోను శంకర్ అత్యంత శ్రద్ధ చూపిస్తారన్నారని. హాలీవుడ్ చిత్రాల తరహాలో ‘ఐ’ చిత్రం ఉంటుందని సౌత్ మీడియాను ఉద్దేశించి ఆస్కార్ రవిచంద్రన్ ఐ మూవీపై ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. శంకర్ తెరకెక్కిస్తున్న ఐ చిత్రం ఘన విజయం సాధిస్తుందా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: