పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సారి తన తుది నిర్ణయాన్ని చెప్పబోతున్నడంటూ ఇండస్ట్రీలో న్యూస్ వినిపిస్తుంది. వవన్ కళ్యాణ్ ఎన్నికలను ఉద్దేశించి మరోసారి బహిరంగ సభను పెట్టబోతున్నాడు. అయితే ఈ సభ తరువాత దాదాపు మరో ఎనిమిది నెలల వరకూ పవన్ కల్యాణ్ ఎటువంటి సభలను పెట్టదలుచుకోలేదు. టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ న్యూస్ ను ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి బహిరంగ సభకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సారి ఆ సభ ఎన్నికలను ఉద్దేశించింది మాత్రమే అని టాక్. రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగి అసమర్ధ నాయుకులకు గట్టిగా సమాధానం చెప్పాలని పవన్ కోరబోతున్నాడు. పవన్ కల్యాణ్ పెట్టబోతున్న ఈ బహిరంగ సభ తరువాత మరో ఎనిమిది నెలల వరకూ ఎటువంటి సభలు పెట్టడని సమాచారం. తరువాత గబ్బర్ సింగ్ 2 మూవీ, ఓ మై గాడ్ రిమేక్ మూవీలలో పవన్ కళ్యాణ్ బిజిగా షూటింగ్స్ లో పాల్గొనబోతున్నాడు. ఈ సంవత్సరంలోనే ఈ రెండు మూవీలను దాదాపు పూర్తి చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ స్పీచ్ ఓటర్లను ప్రభావితం చేస్తుందా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: