మెగా హీరోలలో ఒకడైన సాయి ధరమ్ తేజ్ , ఫిల్మ్ ఇండస్ట్రీకు ఘనంగా ఇంట్రడ్యూజ్ అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు వైవీయస్ చైదరి, సాయి ధరమ్ తేజ్ ని ఫిల్మ్ ఇండస్ట్రీకు పరిచయం చేస్తున్నాడు. రేయ్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్న సాయి ధరమ్ తేజ్ కి పవన్ కళ్యాణ్, చిరంజీవిల సపోర్ట్ ఫుల్ గా ఉంది. అయితే ఆడియో ఫంక్షన్ ను పూర్తి చేసుకున్న రేయ్ మూవీ రిలీజ్ పై పలు డేట్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. రేయ్ మూవీ రిలీజ్ డేట్ పలు సార్లు వాయిదాలు పడుకుంటూ వస్తుంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం మే9న రేయ్ మూవీను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసకున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ డిజైన్స్ ను కూడ రెడీ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం జరుగుతుండడం వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ నటించిన రెండో మూవీ పిల్ల నువ్వు లేని జీవితం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ మూవీ సైతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. రేయ్ మూవీ రిలీజ్ కు లైన్ క్లియర్ అయితే అదే నెలలో తన సెకెండ్ మూవీ సైతం రిలీజ్ అయినా ఆశ్ఛర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు. రేయ్ మూవీ రిలీజ్ డేట్ వాయిదాలు పడటంపై కారణాలు ఏమిటి? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: