పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీపై మహేష్ బాబు క్లారిటి ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితం తను పవన్ పార్టీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీలో పలువరి వద్ద మాట్టాడినట్టు వచ్చిన వార్తలపై క్లారిటి ఇచ్చుకున్నాడంటూ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబధించిన సమాచారాన్ని ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ‘పవన్ కళ్యాణ్ పార్టీను పెట్టుకోవచ్చు. అయితే తను నాకు మంచి స్నేహితుడు. స్నేహితుడిగా అతనకి నా సపోర్ట్ ఉంటుంది. పొలిటికల్ గా అంటే నాకు రాజకీయాలు అంతగా తెలియవు. అంతకు మించి నేను బహిరంగంగా పవన్ స్థాపించి జనసేన పార్టీపై ఎప్పుడూ కామెంట్ చేయలేదు’ అంటూ ఓ సందర్భంలో వివరణ ఇచ్చుకున్నట్టు టాలీవుడ్ మీడియా అంటుంది. మహేష్ బాబు ప్రస్తుతం ఆగడు మూవీకు సంబంధించి షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. ఈ మూవీ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీను చేయబోతున్నాడు. అయితే ఆగడు మూవీ తరువాత ఏ మూవీ చేయబోతున్నాడో సరిగ్గా క్లారిటీ లేదని టాలీవుడ్ అంటుంది. మహేష్ బాబు, పవన్ పార్టీకు సపోర్ట్ ఇస్తాడా? నో కామెంట్ అంటూ కామ్ గా ఉంటాడా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: