బాలీవుడ్ లో హీరోల ఆధిపత్యం కొనసాగుతుందని రీసెంట్ గా ఓ స్టేట్ మెంట్ ఇచ్చిన ప్రియాంక చోప్రా, మరోసారి బాలీవుడ్ హీరోలపై విరుచుకుపడింది. తను ఎందుకు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సిస్టమ్ ను తప్పుపడుతుందో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. హీరోయిన్స్ కు సరైన రెమ్యునరేషన్ ఇవ్వని సంఘటనలు ఈ మధ్య సినీ ఇండస్టీలో ఎక్కువగానే ఉన్నాయంటూ బలమైన కామెంట్స్ చేసింది. ఆ న్యూస్ ను మరవక ముందే, మరో సారి బాలీవుడ్ పై విరుచుకుపడింది. సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ పై ఎప్పుడూ చిన్నచూపూ ఉంటుందంటూ కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్ ఇస్తుంది. సినిమాల విషయంలో హీరోయిన్స్ ప్రాధాన్యత పెరిగినా, రెమ్యునరేషన్ కి సంబంధించి హీరోల హవానే ఇంకా కొనసాగుతుందని చెప్పుకొచ్చింది. హీరోయిన్స్ కు హీరోలకు ఇచ్చే రెమ్యూనిరేషన్ సగం కూడా లేదంటూ ఓ వర్గపు హీరోలను టార్గెట్ చేసింది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు పెరిగితేనే ఈ సమస్యకు పరిష్కారం అంటూ సలహా కూడ విసిరింది. డర్టీ పిక్చర్స్ లాంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నా హీరోయిన్స్ తగిన ప్రాధాన్యత లభించడం లేదని ప్రియాంక అన్నది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా మహిళా బాక్సర్ మేరీకామ్ వాస్తవిక జీవితం ఆధారంగా నిర్మితమవుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో చేస్తోంది. బాలీవుడ్ హీరోలపై ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ నిజమేనా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: