సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ సూపర్ హిట్ టాక్ తో టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ‘లెజెండ్' చిత్రం భారీ విజయం మరియు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హీరో బాలకృష్ణ, హీరోయిన్ సోనాల్ చౌహాన్, దర్శకుడు బోయపాటి శ్రీను, విలన్ పాత్రధారి జగపతి బాబు నిన్న ఉగాది రోజు అంతా బుల్లి తెర పై కనిపించి హడావిడి చేసారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ. ‘లెజెండ్ సినిమా బాగుందని, అన్ని రుచుల సమ్మేళనమని అభిమానులు ఫోన్లు చేసి చెబుతున్నారు. సినిమా విజయంతో మాకు రెండు రోజుల ముందే ఉగాది పండగ మొదలైనట్లు ఉంది’ అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేసారని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.  అయితే జగపతి బాబు మాట్లాడుతూ ‘తొలుత ఈ పాత్ర ఒప్పుకోవడానికి కాస్త ఆలోచించాను. కానీ ఈ చిత్రం చూసిన తర్వాత చాలా మంది ఫోన్లు చేసి పెర్ఫార్మెన్స్ బాగుందని మెచ్చుకుంటున్నారు’ విలన్ పాత్రల వల్ల ఇన్నాళ్లు ఉన్న లేడీస్ ఫాలోయింగ్ పోతుందనుకున్నా, కానీ అలాంటిదేమీ జరుగకపోగా రెట్టింపయిందని చెప్పాడు జగపతి. కానీ తనను బాలయ్య తనను ‘నా కొడకా' అని తిట్టడంతో తన  అభిమానులతో పాటు తన కుటుంబ సభ్యులు కూడ ఫీలయ్యారని నవ్వుతూ చెప్పాడు.  కాగా ఈ వార్తలు ఇలా ఉండగా గడిచిన వీకెండ్ మరియు ఉగాది పండుగ సీజన్ ను ‘లెజెండ్’ పూర్తిగా వినియోగించుకుని కలెక్షన్స్ దుమ్మ రేపుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా గడిచిన 4 రోజుల్లో 25 కోట్లు వసూలు చేసిందని అటు బాలయ్య అభిమానులు ఇటు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: