కేవలం ఒక్క మూవీ కూడ నటించని సంపూర్ణేష్ బాబుకి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ వర్గం బ్రహ్మరథం పడుతుంది. అలాగే మీడియా సైతం సంపూర్ణేష్ కి విపరీతమైన హైప్ క్రియోట్ చేస్తుంది. వీరంతా కలిసి సంపూర్ణేష్ ను ఎందుకు ఇంత పాజిటివ్ గా చూపిస్తున్నారో ఎవ్వరికి అర్ధం కావడంలేదంట. అయితే సంపూర్ణేష్ బాబు నటించిన హ్రుదయకాలేయం మూవీ త్వరలోనే రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీకు సంబంధించిన బిజినెస్ దాదాపు క్లోజ్ అయిందని సమాచారం. ఇదిలా ఉంటే సంపూర్ణేష్ బాబు చేస్తున్న ఓవరాక్షన్ కి ఇండస్ట్రీలోని ఓ బడా వ్యక్తి ఇండైక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ టాక్స్ ను ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. సంపూర్ణేష్ బాబు కు సంబంధించిన పనుల్లో కొద్దిగా గమనించి ఉండాలని, ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీస్ సంపూర్ణేష్ కి దూరంగా ఉండాలని ఆ బడా వ్యక్తి నిర్ణయం తీసుకున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ విషయాలన్ని సంపూర్ణేష్ బాబు తెలుసుకొని, ఎవరో తనపై కావాలనే, తనను ప్రత్యేకంగా గమనిస్తున్నారని అని తెలుసుకున్నాడంట. ఎందుకు సంపూర్ణేష్ ను, ఇండస్ట్రీ వ్యక్తులు ఇలా టార్గెట్ చేశారో తెలియాలంటే కొంత కాలం ఆగితే కాని తెలియదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: