రాజకీయరంగంలో సమూల మార్పులు తీసుకు వస్తూ ప్రజల తరపున ప్రశ్నిస్తాను అని జనసేనతో ఒక సంచలనానికి తెర తీసిన పవన్ కళ్యాణ్ తన పార్టీ వ్యవహారాలలో ఒక కొత్త ట్విస్ట్ ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌ సినీ రాజకీయం అనే ఒక కొత్త ఫార్మాట్‌ను రాజకీయ రంగానికి కార్పరేట్ కల్చర్ లో ప్రజల ముందుకు తీసుకు వెళ్ళడానికి ప్రయత్నించడంతో ఉవ్వెత్తున విమర్శలు రావడంతో ఈ ఊహించని ట్విస్ట్ తీసుకున్నాడు అని అంటున్నారు. తన పార్టీలో ప్రెస్‌మీట్‌లు కూడా ఉండవు అని ముందే ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పటిదాకా రెండే కార్యక్రమాలు పెట్టారు. ఒకటి చిన్న కార్యక్రమం రెండోది సభ. అంతే తప్ప.. ప్రజలకు జరుగుతున్న ద్రోహం చూసి కోపం వచ్చి పార్టీ పెట్టాను అంటూ నాటకీయంగా డైలాగులు వల్లించిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పటిదాకా ప్రజల వద్దకు వెళ్లింది మాత్రం లేదు. బహుశా రాష్ట్రంలో మోడీ వచ్చి సభ పెట్టినప్పుడు ఆ వేదికమీదకో, లేదా భాజపా అభ్యర్థులు తనను ‘ప్రత్యేకంగా’ ఆహ్వానిస్తే ఆ సభలకో ఆయన వెల్తారేమో తప్ప ఆయన ఎంచక్కా నాలుగు గోడల మధ్యకూర్చుని ఫేస్‌బుక్‌ ద్వారా తన ట్విటర్ ద్వారా తన రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేస్తూ కేవలం జగన్ రాజశేఖర్ రెడ్డిలు తప్ప మిగతా రాజకీయ వేత్తలంతా మంచి వాళ్ళు అనే అభిప్రాయాన్ని కలుగ చేస్తూ వరుస పెట్టి తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా జరిగిపోయిన సంఘటనలను గురించి ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటు కేవలం కంప్యూటరు, ఆఫీసుగదికి మాత్రమే పరిమితం అవుతూ ప్రచారం చేస్తాడు అనే అభిప్రాయం కనిపిస్తోంది. జనంలోకి చొచ్చుకుని పోతు ముందు అనుకున్న విధంగా మరో ఐదారు బహిరంగ సభ సమావేశాలు పెట్టె ఆలోచన నుండి దూరంగా జరిగిపోతూ కేవలం తన ఫేస్ బుక్, ట్విటర్లనే అస్త్రాలుగా చేసుకుని ప్రచారం చేసే పవన్ జనసేన ఆలోచన వెనుక ప్రస్తుతం పవన్ కు ఆర్ధికంగా అండదండలు అందిస్తున్న కొందరు వ్యక్తుల ఆలోచనలలో మార్పులు రావడమే కారణం అంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇక భవిష్యత్తులో పవన్ హడావిడి వెబ్ మీడియాలోనే కనిపిస్తుంది కాబోలు.   

మరింత సమాచారం తెలుసుకోండి: