షాకింగ్ న్యూస్... రజినీని భయ పెడుతున్న బయ్యర్లు ! రజనీకాంత్ హీరోగా నటించిన 'విక్రమసింహ' ఈ నెలలో విఉదల చేద్దామని ఈ సినిమా దర్శక నిర్మాతలు ఎంతగానో ప్రయత్నించినా మరోసారి వాయిదా పడటానికి గల ప్రధాన కారణం ఈ సినిమాను గతంలో విడుదల చేస్తాము అని ముందుకు వచ్చిన బయ్యర్లు అంతా ఒకేసారి ముకమ్మడిగా రివర్స్ గేర్లో వెనక్కు వెళ్ళిపోవడం ప్రధాన కారణం అని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఈ సినిమా ఫస్ట్ టీజర్ విడుదల అయ్యాక క్రేజ్ మొత్తం పోయిందని, అంతా దీన్నో కార్టూన్ సినిమాగా భావిస్తున్నారని, డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహంగా ఈ చిత్రం రిలీజ్ చేయటానికి ముందుకు రావటం లేదని అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తాము ఈ సినిమాను విడుదల చేయలేమనీ అందువల్ల తమ అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేయమని ఈ సినిమా దర్శక నిర్మాతల పై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే దర్శకురాలు సౌందర్య ఈ చిత్రం కార్టూన్ చిత్రం కాదని యానిమేటెడ్ చిత్రం అని వివరించి,అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నా బయ్యర్లు ఆమె మాట వినడంలేదట. ఇలాంటి పరిస్థుతులలో ఈ సినిమా బయ్యర్లలో నమ్మకం పెంచడంకోసమే హడావిడిగా కెయస్ రవికుమార్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా మరో ప్రాజెక్ట్ ను ప్రకటించి బయ్యర్లలో నమ్మకాన్ని పెంచడానికి రజినీకాంత్ ప్రయత్నాలు ప్రారంభించాడు అనే వార్తలు వస్తున్నాయి. ఎదిఎలా ఉన్నా రజినీకాంత్ లాంటి టాప్ హీరోలకు కూడ బయ్యర్లు సమస్య రావడం ఆశ్చర్యకరం.  

మరింత సమాచారం తెలుసుకోండి: